Jagapathi Babu Daughter Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాటపడుతూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఒకప్పటి సీనియర్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జగపతిబాబు లాంటి నటుడు సైతం వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరోగా వెలుగొందాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అందరిలో చెరగని ముద్ర వేశాడు… ఇక అలాంటి జగపతిబాబు (Jagapathi Babu) చాలా సింపుల్ గా ఉంటూ బయట ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కూల్ గా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన జగపతిబాబు తమ కూతురు ఫారన్ వ్యక్తిని ప్రేమించిందని వాళ్ల ప్రేమకి జగపతిబాబు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేస్తానని చెప్పాడు. కానీ కొంతమంది అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం జగపతి బాబుతో అలా ఆ ఫారం వాడికి ఇచ్చి ఎలా పెళ్ళి చేస్తావు. వాడెవడికో మన పిల్లని ఇచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అంటూ కొంతవరకు కుల పిచ్చిని చూపించే ప్రయత్నం చేశారట.
Also Read: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల కు తగిలాయి అంతే!
దాంతో పాటుగా ఆ పెళ్లి ని ఆపడానికి ఆ ఫారన్ వ్యక్తిని ఏదో ఒక డ్రగ్స్ కేసులో ఇరికించి అతన్ని జైలుకి కూడా పట్టించాలనే ప్రయత్నం చేశారట. దాంతో జగపతిబాబు అలాంటివేమీ చేయకండి మీరు వారిని జైల్లో పెట్టిస్తే వారిని విడిపించడానికి నాకు చాలా సమయం పడుతుంది అని చెప్పాడట.
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటే తప్పేముంది అంటూ మాట్లాడాడట. మొత్తానికైతే తనకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ పాడని వాళ్ళిద్దరికి పెళ్ళిచేశాడట. ఉన్నది ఒక్కటే జన్మ దాంట్లో కులమ మతం ఇవన్నీ ఎందుకు మనం ఎలా బతకాలనుకుంటే అలా బతికితే మంచిదని చెప్పాడు.
ఇక దాంతో పాటుగా మనం ఉన్నప్పుడు చాలా బాగా బతకడానికి ప్రయత్నం చేయాలి మనం వెళ్లిపోయిన తర్వాత మనం లెగసిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా మనకి ఏమొస్తుంది. మనమైతే ఇక్కడ ఉండడం లేదు కదా అన్నట్టుగా ఆయన చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాడట…ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…