https://oktelugu.com/

Harman Preet -Yuvraj : అప్పుడు యువి…ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్.. ఆ ఘనతలు వీరికే సొంతం

Harman Preet -Yuvraj  : టీ 20 అంటే వేగానికి కొలమానం.. బ్యాట్లు విరుగుతాయి. బంతులు పలుగుతాయి. ఇన్నాళ్లు ఈ ఆట కేవలం మెన్స్ టి20 మ్యాచ్ లో మాత్రమే కనిపిస్తుంది అనుకునేవారు. కానీ ఈ సాంప్రదాయానికి మహిళలు బ్రేక్ వేశారు. నేను కూడా పురుషులకంటే దీటుగా ఆడుతామని సంకేతాలు ఇచ్చారు. ముంబై వేదికగా జరిగిన తొలి మహిళ ఐపిఎల్ టి20 క్రికెట్ ప్రారంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు దీనిని నిరూపించింది. గుజరాత్ జెయింట్స్ తో […]

Written By:
  • Rocky
  • , Updated On : March 5, 2023 / 08:36 AM IST
    Follow us on

    Harman Preet -Yuvraj  : టీ 20 అంటే వేగానికి కొలమానం.. బ్యాట్లు విరుగుతాయి. బంతులు పలుగుతాయి. ఇన్నాళ్లు ఈ ఆట కేవలం మెన్స్ టి20 మ్యాచ్ లో మాత్రమే కనిపిస్తుంది అనుకునేవారు. కానీ ఈ సాంప్రదాయానికి మహిళలు బ్రేక్ వేశారు. నేను కూడా పురుషులకంటే దీటుగా ఆడుతామని సంకేతాలు ఇచ్చారు. ముంబై వేదికగా జరిగిన తొలి మహిళ ఐపిఎల్ టి20 క్రికెట్ ప్రారంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు దీనిని నిరూపించింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ జట్టులో సైకా ఇషాక్ నాలుగు వికెట్లు తీసింది.

    తొలి ఉమెన్స్ టీ20 ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో పంజాబ్ పడచు హర్మన్ సత్తా చాటింది. 30 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 65 పరుగులు చేసింది.. ఒక దశలో సెంచరీ చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ రాణా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయింది. అయితే హర్మ న్ 15, 16 ఓవర్ల మధ్యలో వరుసగా ఏడు ఫోర్లు కొట్టింది.. మౌనిక పటేల్ వేసిన 15 ఓవర్ లో చివరి నాలుగు బంతులు, గార్డ్ నర్ వేసిన మరుసటి ఓవర్ లో రెండో బంతికి స్ట్రైక్ తీసుకొని వరుసగా మరో మూడు ఫోర్లు బాదింది. గుజరాత్ చెత్త ఫీల్డింగ్ కూడా కౌర్ కు కలిసి వచ్చింది. దీంతో ముంబై జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.

    ఇక ఐసీసీ పురుషుల టీ 20 ప్రారంభ సీజన్ లో యువరాజ్ సింగ్ విధ్వంసాన్ని ఎవరూ మరచిపోలేరు. ముఖ్యంగా అతడు ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్.. బ్రాడ్ బౌలింగ్లో అతడు వరుసగా 6 సిక్సర్లు బాదాడు. అంతేకాదు 12 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.. ఇప్పుడు హర్మన్ కూడా అదే స్థాయిలో ఆడుతోంది.. గుజరాత్ జట్టుతో జరిగిన డబ్ల్యూ పిఎల్ టి20 ప్రీమియర్ లీగ్ లో ఏకంగా వరుసగా ఏడు ఫోర్లు కొట్టింది. దీంతో ఆమె ఆట తీరును నాటి యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ తో అభిమానులు పోల్చుతున్నారు. భారత మహిళా జట్టుకు యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ దొరికిందని కితాబు ఇస్తున్నారు.

    https://twitter.com/ESPNcricinfo/status/1632051172344483846?s=20