PAK Vs SA : పాకిస్తాన్‌లోని గడాఫీ(Gadafi) స్టేడియంలో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాప్రికా ఫైనల్ కోసం కసితో ఎదురు చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీటీజ్క్ అరంగేట్రంతోనే అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో 150 పరుగులు చేశాడు. అయినా న్యూజిలాండ్‌పై ఓటమితో ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రమంలో నాకౌట్(Knok out) మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడాలని తహతహాడుతోంది. ఫైనల్‌లో కూడా సత్తాచాటి సీరీస్ గెలవాలని భావిస్తోంది. పాకిస్తాన్ దక్షిణాఫ్రికా పర్యటనలో హెన్రిచ్ క్లాసెస్(Henrich Classen) పాకిస్తాన్‌పై వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఇక టీ20 2025 ప్లేఆఫ్‌ల కారణంగా దక్షిణాఫ్రికా కివీస్‌తో అనుభవం లేని జట్టుతో ఆడింది. ఈ తరుణంలో ముక్కోణపు టోర్నీ గెలవాలన్న లక్ష్యంతో ఉంది. మొహమ్మద్ రిజ్వాన్ (Mahmad rizwan)నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టుతో హై–వోల్టేజ్ పోరుకరు సిద్ధమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు నాకౌట్ మ్యాచ్‌లో రాణించాలని సౌత్ ఆప్రికా భావిస్తోంది ఆ జట్టు వికెట్ కీపర్–బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ దీనిని ఒక పరీక్షగా చూస్తున్నాడు. పాకిస్తాన్‌పై నెగ్గితేనే తన మోములో నవ్వు కనిపిస్తుందని పేర్కొన్నాడు.
పిచ్ పరిస్థితులు..
కరాచీ వేదికగా పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. ఈ మైదానంలో చివరి మ్యాచ్ 2023 మేలో జరిగింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మైదానంలో మొత్తం ఆరు వన్డేలు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఐదు మ్యాచ్‌లు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 280కిపైగా పరుగులు చేశాయి. ఏడో మ్యాచ్‌లో గెలుపుపై ఇరు జట్లు దీమాగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సాధన..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ మ్యాచ్ ఫలితం విజేతలకు కొత్త ఉత్సాహం ఇవ్వడం ఖాయం. పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఇరు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డనున్నాయి. బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.