IND Vs AUS : ఏళ్లకు ఏళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్లో ఇదే తీరైన ఆటను ప్రదర్శిస్తోంది. అందువల్లే క్రికెట్ లో కీలక టోర్నీలలో విజయాలు సాధిస్తున్నది. ప్రత్యర్థి ఆటగాళ్లపై మానసిక యుద్ధం చేస్తూ గెలుపులు సొంతం చేసుకుంటున్నది. అయితే అలాంటి జట్టుకు గింగిరాలు తిరిగేలాగా రిప్లై ఇచ్చాడు టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో అతడు ఏకంగా 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 7ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి . మొత్తంగా అతడు 193 బంతులు ఎదుర్కొన్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి తొలి వికెట్ కు 172 రన్స్ పార్టనర్షిప్ బిల్ట్ చేశారు.
ఆసక్తికర సంఘటనలు
శనివారం రెండో రోజు ఆటలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.. తనను కవ్వించిన స్టార్క్ కు హర్షిత్ రాణా పదునైన బంతివేసి దీటుగా సమాధానం ఇచ్చాడు. వేగవంతమైన బంతివేసి స్టార్క్ హెల్మెట్ ను బ్రేక్ చేశాడు. రాణా వేసిన బంతులను ఎదుర్కొనే సమయంలో స్టార్క్ నోటికి పని చెప్పాడు. నీకంటే వేగవంతమైన బంతులు నేను వేస్తానని స్టార్క్ అన్నాడు. దానికి హర్షిత్ ఎటువంటి బదులు ఇవ్వకుండానే నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వేగవంతమైన బంతులు వేశాడు. అయితే హర్షిత్ వేసిన బౌన్సర్ ను తప్పించుకోవడానికి స్టార్క్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి తక్కువ ఎత్తులో రావడంతో స్టార్క్ హెల్మెట్ బద్దలైంది. ఆ బంతివేగానికి హెల్మెట్ బ్యాడ్జ్ బ్రేక్ అయింది.
జైస్వాల్ కవ్వించాడు
ఇక రెండవ ఇన్నింగ్స్ లో స్టార్క్ ను యశస్వి జైస్వాల్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నువ్వు నాకు నెమ్మదిగా బంతులు వేస్తున్నావ్.. నీ వేగం ఇంతేనా.. నీ సామర్థ్యాన్ని పెంచు.. అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. దానికి స్టార్క్ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. నెమ్మదిగా తన బౌలింగ్ వేయడం మొదలుపెట్టాడు.. అయితే స్టార్క్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ భారీ సిక్స్ కొట్టాడు. మిడ్ పిచ్ లో పడిన బంతి యశస్వి బ్యాట్ ఎత్తులోకి రావడంతో.. అతడు అంతే వేగంగా కొట్టాడు. దీంతో బాల్ అమాంతం గాల్లో లేచి స్టాండ్స్ అవతల పడింది. దీంతో మైదానంలో ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఆ తర్వాత గురించే బంతులు వేసినప్పటికీ యశస్వి తన నిగ్రహాన్ని కోల్పోలేదు. ” ఒకప్పుడు ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే టీమిండియా ఆటగాళ్లలో ఒక రకమైన ఫోబియా ఉండేది. కానీ ఇప్పుడు టీమిండియా ఆట మారింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు భయపడే పరిస్థితి నెలకొంది. అందుకే క్రికెట్లో ఏదీ శాశ్వతం కాదు.. అది ఆస్ట్రేలియా ఆటగాళ్లు గుర్తుపెట్టుకుంటే మంచిదని” టీమిండి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
After getting hit for a six and then pegging him down, Mitchell Starc said something to Yashasvi Jaiswal. The response that came back was better than a six
A cricketing classic that no fast bowler wants to hear… pic.twitter.com/9OBHENi9w1
— Dibyendu Nandi (@ydnad0) November 23, 2024