https://oktelugu.com/

WTC Final: పంత్, జడేజా నిలబడితేనే విజయం

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేస్తూ భారత బ్యాట్స్ మెన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. కోహ్లీ, పూజారా, రోహిత్ , రహానే లాంటి దిగ్గజాలే వారి బౌలింగ్ కు తాళలేక ఔట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఏ రేంజ్ లో చెలరేగుతున్నారో అర్థమవుతోంది. కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా రెండో ఇన్సింగ్స్ లో కుప్పకూలి పోరాడుతోంది. పేసర్లు కైల్ జేమీసన్, […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2021 5:41 pm
    Follow us on

    ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేస్తూ భారత బ్యాట్స్ మెన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. కోహ్లీ, పూజారా, రోహిత్ , రహానే లాంటి దిగ్గజాలే వారి బౌలింగ్ కు తాళలేక ఔట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఏ రేంజ్ లో చెలరేగుతున్నారో అర్థమవుతోంది.

    కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా రెండో ఇన్సింగ్స్ లో కుప్పకూలి పోరాడుతోంది. పేసర్లు కైల్ జేమీసన్, ట్రెంట్ బౌల్ట్ రెచ్చిపోవడంతో తొలి సెషన్ లో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే భోజన విరామం సమయానికి భారత్ జట్టు 130 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.

    నిన్న రెండు వికెట్లు ఓపెనర్లు రోహిత్, గిల్ ఔట్ అయ్యారు. ఈరోజు కోహ్లీ, పూజారా బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే కివీస్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ విరాట్ 13 పరుగులకు, పూజారా 15 పరుగులకే ఔట్ అయ్యి విఫలమయ్యారు. ఆరోరోజు ఆట ప్రారంభమైన అరగంటకే ఇద్దరూ ఒక్క పరుగు తేడాతో పెవిలియన్ చేరడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. జేమిసన్ వీరిద్దరి ఔట్ చేసి న్యూజిలాండ్ ను పోటీలో నిలిపాడు. ఇక ఆ తర్వాత రహానే 15 పరుగులకే ఔట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది.

    దీంతో భారత్ 109 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం దూకుడు ఆటగాళ్లు అయిన పంత్, జడేజా కలిసి టీమిండియాకు మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ను ముగించారు. ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఔట్ అయితే టీమిండియా ఓటమి ఖాయం. మరి వీరు ఎంత సేపు ఆడుతారన్నది వేచిచూడాలి.