WTC Final 2023- Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్ తో సాధిస్తాడా?

ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లైయన్ బౌలింగ్ లోనే చటేశ్వర పుజారా 570 పరుగులు సాధించాడు. అదే బౌలర్ పై కోహ్లీ 511 పరుగులు వద్ద ఉన్నాడు. ఈ మ్యాచులో పుజారా రికార్డును కోహ్లి బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. పుజారా రికార్డ్ బద్దలు కొట్టడానికి 60 పరుగులు దూరంలో కోహ్లీ ఉన్నాడు.

Written By: BS, Updated On : June 7, 2023 10:19 am

WTC Final 2023- Virat Kohli

Follow us on

WTC Final 2023- Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్ – ఆస్ట్రేలియా జట్లు కూడా ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టే గొప్ప అవకాశం లభించింది. ఆ రికార్డులు ఏమిటి, వాటిని బద్దలు చేసే అవకాశం ఉందా..? లేదా..? ఉన్నది మీరూ చదివేయండి.

విరాట్ కోహ్లీ.. భారత జట్టులో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాడు. ఒక రకంగా చెప్పాలంటే రికార్డుల రారాజు. పిన్న వయసులోనే అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. తాజాగా మరో అరుదైన రికార్డులను నమోదు చేసే అవకాశం టెస్ట్ ఛాంపియన్ షిప్ ద్వారా కోహ్లీకు లభించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏ మాత్రం రాణించిన ఆ రికార్డులు బద్దలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం..

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు అనేక రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. వీటిలో ఐసీసీ నాకౌట్ స్టేజ్ లో చేసిన పరుగులు ఒకటి కావడం గమనార్హం. ఐసీసీ నాకౌట్ స్టేజ్ (సెమీఫైనల్స్, ఫైనల్స్) మ్యాచ్ లో ఇప్పటి వరకు కోహ్లీ 15 మ్యాచులు ఆడి 620 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ రాణిస్తే.. సచిన్ (657 పరుగులు), రికీ పాంటింగ్ (731 పరుగులు) రికార్డులను దాటేసే అవకాశం ఉంది. సచిన్ రికార్డు బద్దలు కొట్టడానికి కోహ్లీకి 38 పరుగులు అవసరం కాగా, పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టడానికి 112 పరుగులు కావాలి. కోహ్లీ గనుక ఒక ఇన్నింగ్స్ లో రాణించినా ఈ రికార్డు సులభంగా బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

రెండు వేల పరుగుల మైలురాయి..

ఇక ఆస్ట్రేలియా జట్టుపై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి కోహ్లీ కొద్ది దూరంలోనే ఉన్నాడు. మరో 21 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాతో టెస్టుల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. 164 పరుగులు సాధిస్తే ఆసీస్ పై రాహుల్ ద్రావిడ్ (2,143) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టవచ్చు.

రిచర్డ్స్ రికార్డును దాటేసే అవకాశం..

ఇప్పటి వరకు కోహ్లీ 108 టెస్ట్ మ్యాచ్ ల్లో 8,416 పరుగులు చేశాడు. మరో 125 పరుగులు చేస్తే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిచర్డ్స్ పేరిట 8,416 పరుగులతో ఈ రికార్డు ఉంది.

పుజారా రికార్డును బద్దలు కొట్టడానికి ఛాన్స్..

ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లైయన్ బౌలింగ్ లోనే చటేశ్వర పుజారా 570 పరుగులు సాధించాడు. అదే బౌలర్ పై కోహ్లీ 511 పరుగులు వద్ద ఉన్నాడు. ఈ మ్యాచులో పుజారా రికార్డును కోహ్లి బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. పుజారా రికార్డ్ బద్దలు కొట్టడానికి 60 పరుగులు దూరంలో కోహ్లీ ఉన్నాడు.

ఇంగ్లాండులో అత్యధిక పరుగులు సాధించిన రెండు ఆటగాడు..

ఇంగ్లాండులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో రాహుల్ (2,645) తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ (2,574) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మెరుగైన స్కోరు సాధిస్తే కోహ్లీ టాప్ లోకి వచ్చే అవకాశం ఉంది.

55 పరుగుల దూరంలో మరో మైలురాయి..

అన్ని ఫార్మాట్లు కలిపి ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు కోహ్లీ 4,945 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మరో 55 పరుగులు సాధిస్తే 5 వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. అలాగే, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ సచిన్ (22)తో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానం (21)లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ రికార్డులను ఈ మ్యాచ్ ద్వారా సమం లేదా అధిగమించే అవకాశం ఉంది.

సౌరబ్ గంగూలి రికార్డు చేదించే అవకాశం..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో నిర్వహించిన ఫైనల్ లో సౌరబ్ గంగూలీ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో గనుక కోహ్లీ సెంచరీ చేస్తే 23 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లో కోహ్లీ ఇప్పటి వరకు 75 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్ లో మరో శతకం సాధిస్తే అత్యంత వేగంగా (555 మ్యాచ్ ల్లో) 76 శతకాలు సాధించిన క్రికెటర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (587) పేరిట ఉంది.