WPL 2026: ఈ కథనం చదివేముందు కింద ఒక వీడియో లింక్ ఉంది. అది ఒకసారి చూడండి. ఆ వీడియోలు దాదాపు ముగ్గురు ఫారిన్ క్రికెటర్లు.. అది కూడా మహిళా క్రికెటర్లు నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు ఎంతో స్వేచ్ఛగా ఉదయపు నడకను ఆస్వాదిస్తున్నారు. పైగా తమ సొంత దేశంలో ఉన్నట్టే వారు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఈ ఉదాహరణ చాలు భారత్ ఎంత సురక్షితమైన దేశమో చెప్పడానికి.
భారతదేశంలో క్రికెటర్ల పై ప్రత్యక్ష దాడులు జరగలేదు. ముఖ్యంగా ఫారిన్ క్రికెటర్ల పై దాడులు ఎప్పుడూ జరగలేదు. వారు ప్రాణ భయంతో పరుగులు పెట్టలేదు. ఇక్కడ సెక్యూరిటీ లేదని ఏ దేశపు క్రీడాకారులు కూడా ఆరోపణలు చేయలేదు. భారతదేశంలో ఆడేందుకు తనకు ఇష్టం లేదని ఏ దేశపు జట్టు ఆటగాడు కూడా చెప్పలేదు. చివరికి పాకిస్తాన్ ప్లేయర్లు కూడా భారతదేశంలో ఆడటాన్ని ఆస్వాదిస్తామని చెప్పారు. అవకాశం ఉంటే ఆ దేశంలో ఆడేందుకు తమకు ఆసక్తి ఉందని వెల్లడించారు. కానీ, లేకి బంగ్లాదేశ్ క్రికెటర్లకు మాత్రం ఇది అర్థం కావడం లేదు. భారతదేశం ఎంత స్వేచ్ఛాయుతమైన దేశమో, ఎంతటి భద్రత ఉన్న దేశమో అర్థం కావడం లేదు…
భారతదేశంలో టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తాము అక్కడ ఆడలేమని.. తాము ఆడే మ్యాచ్ లు మొత్తం తటస్థ వేదికలలో నిర్వహించాలని బంగ్లాదేశ్ గొంతెమ్మ కోరికలు కోరుతోంది. వాస్తవానికి బంగ్లాదేశ్లో కొద్ది రోజులుగా అల్లర్లు చెలరేగుతున్నాయి. హిందువులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో హిందువులను అంతం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ సహజంగానే ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడులు జరగకుండా చూడాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది. ఆ తర్వాత ఐపీఎల్లో కోల్ కతా జట్టు తరఫున ఆడుతున్న బంగ్లాదేశ్ బౌలర్ ను తప్పించింది. దీనిని సాకుగా చూపించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారతదేశంలో టి20 వరల్డ్ కప్ ఆడేది లేదని స్పష్టం చేసింది. ఐసీసీ అనేక పర్యాయాలుగా హెచ్చరించినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మారడం లేదు.
ప్రస్తుతం మన దేశం వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. బెంగళూరు జట్టు తరఫున లారెన్ బెల్, జార్జియా, నడైన్ డీ క్లార్క్ వంటి ఉమెన్ క్రికెటర్లు ఆడుతున్నారు. వారు వడోదరా కు ఓ మ్యాచ్ సందర్భంగా వచ్చారు. ఈ క్రమంలో వడోదరనగరంలో మార్నింగ్ వాక్ కూడా చేశారు. ఆ సమయంలో వారి పక్కన సెక్యూరిటీ అంతంత మాత్రం గానే ఉంది. పైగా వారు తమ సొంత దేశంలో ఉన్నట్టుగానే ప్రవర్తించారు. కానీ, బంగ్లాదేశ్ పురుష క్రికెటర్లకు ఇది అర్థం కావడం లేదు. పైగా భారతదేశం మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసే ముందు ఈ పారింది మహిళా క్రికెటర్లు ఆస్వాదిస్తున్న స్వేచ్ఛను బంగ్లాదేశ్ పురుష క్రికెటర్లు చూడాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
View this post on Instagram