WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో బెంగళూరు జట్టు దూసుకుపోతోంది. వరుసగా ఐదు విజయాలు సాధించి అదరగొట్టింది. తద్వారా మరోసారి ట్రోఫీని అందుకోవడానికి బలంగా అడుగులు వేస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగిన బెంగళూరు జట్టు.. స్మృతి మందాన నాయకత్వంలో విజయపథంలో కొనసాగుతోంది. ఇప్పటికే బెంగళూరు ట్రోఫీ అందుకుంటుందని ఆ జట్టు అభిమానులు ఒక అంచనాకు వచ్చారు.. సోషల్ మీడియాలో అయితే ఒక ఉద్యమమే కొనసాగిస్తున్నారు.
తాజాగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టను ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో వరుసగా నాలుగో విజయాన్ని బెంగళూరు జట్టు నమోదు చేసింది. ఈ విజయం తర్వాత బెంగళూరు సారధి స్మృతి మందాన తమ జట్టు సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పుకున్నారు..” మా జట్టులో సమష్టి తత్వం కనిపిస్తోంది. ప్లేయర్లు మొత్తం ఏకతాటి మీదికి వచ్చే ఆడుతున్నారు. బ్యాటింగ్లో తిరుగులేదు. బౌలింగ్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఫీల్డింగ్ లో అయితే సరికొత్త ప్రమాణాలను ప్లేయర్లు నెలకొల్పుతున్నారు. వీరంతా కూడా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఇదే జోరు కొనసాగిస్తే కచ్చితంగా రెండో సారి కూడా మేమే ట్రోఫీ అందుకుంటామని” స్మృతి వెల్లడించింది…
ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ముందుగా బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్లో డెబ్యూ ప్లేయర్ సయాలి, ఫారిన్ స్టార్ బౌలర్ లారెన్ బెల్ అదరగొట్టారు. ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. తొలి రెండు ఓవర్లలోనే ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షపాలీ వర్మ (62) ఒంటరి పోరాటం చేసింది. తద్వారా ఢిల్లీ జట్టు 166 పరుగులు చేసింది. సాయలీ, బెల్ చెరి మూడు వికెట్లు సాధించారు.
167 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన బెంగళూరు ఏ దశలో కూడా ఓడిపోయే విధంగా కనిపించలేదు. కెప్టెన్ స్మృతి దిమ్మ తిరిగిపోయే ఆరంభం అందించింది. 61 బంతుల్లో 96 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. నాలుగు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. ప్లేయర్ ఆఫ్ ది ఉమెన్ పురస్కారాన్ని అందుకుంది.
పలాష్ ముచ్చల్ తో వివాహాన్ని రద్దు చేసుకున్న తర్వాత స్మృతి భీభత్సంగా క్రికెట్ ఆడుతోంది. మరింత జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. తద్వారా తన జీవితంలో ఒక చీకటి అధ్యాయానికి ఆట ద్వారా ముగింపు పలికినట్టు నిరూపిస్తోంది. స్మృతి ఆట తీరు పట్ల బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో వీరలెవల్లో కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు జట్టు తోపు దమ్ముంటే ఆపు అన్నట్టుగా పోస్టులు పెడుతూ.. సందడి చేస్తున్నారు.
