Daryl Mitchell: ఎప్పట్లాగానే న్యూజిలాండ్ ఓపెనర్లు మూడో మ్యాచ్ లో కూడా తేలిపోయారు. టీమ్ ఇండియా బౌలర్లు ఆదిలోనే అడ్డుకట్ట వేశారు. దీంతో ఇండోర్ వేదికగా ఆదివారం జరుగుతున్న మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుకు పతనం తప్పదని.. భారీ స్కోర్ చేసే అవకాశం టీమిండియా బౌలర్లు ఇవ్వరని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడే మరోసారి న్యూజిలాండ్ బ్యాటర్ మ్యాజిక్ చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ టాప్ స్కోరర్ కొనసాగుతున్నాడు. రెండో వన్డేలో సూపర్ సెంచరీ చేసి.. తన జట్టును గెలిపించిన అతడు.. మూడో వన్డేలో అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే(5), నికోల్స్(0) విఫలమయ్యారు. అయితే యంగ్ (30) తో కలిసి మూడో వికెట్ కు మిచెల్ 53 పరుగులు జోడించాడు.. అయితే యంగ్ 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఫలితంగా మిచెల్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అయినప్పటికీ తన జోరు కొనసాగించడాన్ని ఏమాత్రం ఆపలేదు.
మూడో మ్యాచ్లో 64 బంతులు ఎదుర్కొన్న అతడు 60 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తొలి మ్యాచ్లో మిచెల్ 84 పరుగులు చేశాడు. రెండవ మ్యాచ్లో 131* పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్లో అయితే ఇప్పటివరకు 61* పరుగులు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో అతడు ఇప్పటికే 267 పరుగులు చేశాడు. ఇందులో 22 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 108.98 గా ఉంది. యావరేజ్ 267 గా నమోదయింది. ఐసీసీ వన్డే మెన్స్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో మిచెల్ ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
మిచెల్ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రారంభంలో సత్తా చూపించినప్పటికీ.. తర్వాతి ఓవర్లలో భారత బౌలర్లు అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం క్రీజ్ లో ఫిలిప్స్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు రెండు బంతులు ఎదుర్కొన్న అతడు 19 పరుగులు చేశాడు. వేగంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నప్పటికీ.. మిచెల్ కు మాత్రం అద్భుతంగా సహకరిస్తున్నాడు. మిచెల్, ఫిలిప్స్ జోడి నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.. గూగుల్ ప్రిడిక్షన్ ప్రకారం న్యూజిలాండ్ జట్టుకు 24, భారత జట్టుకు 76% విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
