WPL 2026 Mega Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం అట్టహాసంగా జరిగింది. టీమిండియా మహిళా వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ వేలానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. కార్పొరేట్ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు జాక్ పాట్ తగిలింది.
న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం జరిగింది. హైదరాబాద్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ని బెంగళూరు జట్టు ఏకంగా 75 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 30 లక్షల కనీస అరుంధతి రెడ్డి వేలంలోకి వచ్చింది.. అరుంధతి రెడ్డి కోసం గతంలో ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ యాజమాన్యాలు పోటీపడ్డాయి. చివరికి అరుంధతి రెడ్డిని బెంగళూరు యాజమాన్యం 75 లక్షలకు దక్కించుకుంది. గడిచిన మూడు సీజన్లలో అరుంధతి రెడ్డి కనీస ధర 30 లక్షలకు ఢిల్లీ జట్టుకు ఆడింది.
ఇప్పటివరకు అరుంధతి రెడ్డి 20 మ్యాచ్లు ఆడింది. 17 వికెట్లు పడగొట్టింది. భారత మహిళల జాతీయ జట్టులో కీలక ప్లేయర్ గా అరుంధతి కొనసాగుతోంది. గాయం వల్ల 2025 ప్రపంచ కప్ టోర్నీలో ఆమె ఆడలేదు. అయితే ప్రపంచ కప్ సాధించిన టీమిండియాలో మాత్రం సభ్యురాలిగా ఆమె ఉంది. అదనపు ప్లేయర్ గా ఆమె భారత జట్టుకు సేవలు అందించింది. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా ఆమె క్యాచ్ లు కూడా అందుకుంది. టీమిండియా వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో అరుంధతి రెడ్డికి గత మూడు సీజర్ల కంటే ఎక్కువ ధర లభించింది.
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణిరెడ్డి అద్భుతమైన ధర దక్కింది. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చింది. ఆమెను గతంలో తను ఆడిన ఢిల్లీ యాజమాన్యం 1.30 కోట్లకు కొనుగోలు చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొంగడి త్రిష, మమత మడివాల, కస్తూరి భవ్య, సుజాతకు ఈసారి ఈ రాష్ట్ర ఎదురైంది. పదిలక్షల కనీస ధరతో వీరు వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హాసిని, లక్ష్మీ ప్రసన్న, మేఘన సబ్బినేని, స్నేహ దీప్తిని కూడా యాజమాన్యాలు పురుగులు చేయడానికి ఇష్టపడలేదు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్లు కూడా వారిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటాయి. అయితే త్రిష లాంటి ప్లేయర్ అద్భుతాలు సృష్టించినప్పటికీ.. పొట్టి ఫార్మాట్ లో టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించినప్పటికీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో యాజమాన్యాలు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి చరణిరెడ్డి ని ఢిల్లీ జట్టు 1.30 కోట్లకు కొనుగోలు చేసింది. అరుంధతి రెడ్డిని బెంగళూరు జట్టు 75 లక్షలకు దక్కించుకుంది. త్రిష, హాసిని, లక్ష్మీ ప్రసన్న, మేఘన, మమత, సుజాత, కస్తూరి ని యాజమాన్యాలు కొనుగోలు చేయలేదు.