WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రోఫీని గెలిచింది. తొలిసారి డబ్ల్యూపీఎల్ కప్ అందుకోవడంతో స్మృతి మందాన సేన, బెంగళూరు చాలెంజర్స్ అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ సీజన్లో విజేతగా నిలిచిన బెంగళూరుకు ఎంత ప్రైజ్ మనీ లభించింది? రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ ఎంత నగదు పొందింది? ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐపీఎల్ లో ప్రతిసారీ నిరాశ ఎదురవుతున్నప్పటికీ బెంగళూరు జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ గత 16 సీజన్లలో ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్ష గానే మిగిలింది. పురుషుల టీం సాధించకపోయినప్పటికీ మహిళల టీం ఐపీఎల్ కప్ అందుకుంది. రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్ జట్టును సగర్వంగా కప్ ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్లో ఆల్ రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి సత్తా చాటింది.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 18.8 ఓవర్లలోనే 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. సోఫీ మొలినెక్స్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసింది. శ్రేయాంక నాలుగు వికెట్లు పడగొట్టింది. శోభన రెండు వికెట్లు తీసి అదరగొట్టింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ 44 టాప్ స్కోరర్ గా నిలిచింది.. ఇక బెంగళూరు జట్టులో ఎలీస్ ఫెర్రీ 35, సోఫీ డివైన్ 32, స్మృతి 31 రాణించడంతో బెంగళూరు 19.3 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన బెంగళూరు జట్టుకు ఆరు కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ జట్టుకు మూడు కోట్ల నగదు లభించింది. వాస్తవానికి ఈ రెండు జట్లలో ఢిల్లీ ఈ టోర్నీలో మెరుగైన ప్రతిభ చూపించింది. బెంగళూరు ప్రారంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫైనల్ చేరింది. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది.
ఇక ఐపీఎల్ 2008 నుంచి కొనసాగుతోంది. ఇప్పటివరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ లీగ్ గా ఇది కొనసాగుతోంది. 2020 వరకు ప్రైజ్ మనీ 10 కోట్లుగా ఉండేది. 2021 నుంచి దీనిని 20 కోట్లకు పెంచారు. రన్నరప్ జట్టుకు 13 కోట్లు ఇస్తున్నారు.
It’s the Royal Challengers Bangalore’s captain Smriti Mandhana signing it off in style after the TATA WPL 2024 triumph #TATAWPL | #Final | #DCvRCB | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/cS8KQPFDYt
— Women’s Premier League (WPL) (@wplt20) March 17, 2024