World Cup 2023
World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం సెమీఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయాలను పక్కన పెడితే వరల్డ్ కప్ లీగ్ దశలో పది టీములు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ తమదైన స్థాయిలో మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ టీం ల తరఫున ఆడి ఆడినట్టుగా ఆడిన చాలామంది ప్లేయర్లు కూడా వరల్డ్ కప్ లో వాళ్ల సత్తాను చాటి మరి వాళ్ల టీం లకి అద్భుతమైన విజయాలను అందించారు.అలాగే టీమ్ గెలుపు లో వాళ్ల వంతు గా వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఒక సమర్థుడి బలం సమయం వచ్చినప్పుడే బయటికి వస్తుంది. ఒక వారియర్ పోరాటం అణిచివేత నుంచే మొదలవుతుంది. ఒక వీరుడి గెలుపు తనను తాను నమ్మడం మీదనే ఆధారపడి ఉంటుంది అనే రేంజ్ లో వరల్డ్ కప్ లో చాలా మంది ప్లేయర్లు వాళ్ళని వాళ్ళు నమ్మి అద్భుతమైన ప్లేయర్లు గా ఎదిగారు. ఇక అలాంటి ప్లేయర్లు ఈ వరల్డ్ కప్ లో చాలా మంది ఉన్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో అద్బుతం గా ఆడి వాళ్ల టీమ్ లకి విజయాలను అందించిన ప్లేయర్లు ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర గురించి తెలుసుకున్నట్లయితే ఈయన ఇండియన్ సంతతి కి చెందిన ప్లేయర్ అయినప్పటికీ న్యూజిలాండ్ టీం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు.ఇక ఈయన మొదటిసారి వరల్డ్ కప్ లో అడుగు పెట్టాడు ఇక ఈ టోర్నీ లో ఈయన ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడితే అందులో 565 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు,రెండు హాఫ్ సెంచరీ లు చేయడం విశేషం… మొదట స్స్పిన్నర్ గా న్యూజిలాండ్ టీం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పుడు నెంబర్ త్రీ లో పర్మినెంట్ బ్యాట్స్ మెన్ గా చాలా కీలకమైన ప్లేయర్ గా మారాడు. న్యూజిలాండ్ టీమ్ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడిందంటే అందులో ఆయన సెంచరీ లేదా ఆఫ్ సెంచరీ అయిన నమోదు చేసి ఉంటాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈ వరల్డ్ కప్ లో ఒక వెలుగు వెలిగిన ప్లేయర్ గా మంచి రికార్డుని అందుకున్నాడు అరంగెట్రం చేసిన వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలు చేయడం అంటే మామూలు విషయం కాదు ఇందులో కూడా ఆయన ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు…
ఇబ్రహీం జద్రాన్
ఆఫ్గనిస్తానికి చెందిన ఈ ప్లేయర్ తొమ్మిది మ్యాచ్ ల్లో 376 పరుగులు చేశాడు. ఇక అందులో ఒక సెంచరీ , ఒక హాఫ్ సెంచరీ కూడా ఉండడం విశేషం…ఈయన ప్రతి మ్యాచ్ లో కూడా ఆఫ్గనిస్తాన్ టీం కి సేవలు అందిస్తునే టీం విజయంలో కీలక పాత్ర వహించాడు.అఫ్గాన్ టీమ్ నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది అంటే అందులో ఈయన పాత్ర చాలా వరకు ఉందనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టు గా చెప్పుకునే ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసి 129 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు… ఇక ఫ్యూచర్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం ని ముందుండి నడిపించడంలో ఇబ్రహీం జద్రాన్ కీలక పాత్ర వహిస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అఫ్గాన్ తరుపున వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఒకే ఒక ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు…
అజమతుల్లా ఒమర్ జాయ్
ఆఫ్గనిస్తాన్ కు చెందిన ఈ ప్లేయర్ ఎనిమిది ఇన్నింగ్స్ లలో 353 పరుగులు చేశాడు.అందులో మూడు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక ఆఫ్గనిస్తాన్ టీం విజయంలో ఇతను కూడా కీలక పాత్ర వహించాడు. అలాగే ఇతను ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శన ఇచ్చాడు.బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. 9 మ్యాచ్ ల్లో ఏడు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ టీం కి అద్భుతమైన విజయాలను అందించాడు…
గ్లీన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ దేశానికి చెందిన ఈ ప్లేయర్ 9 మ్యాచుల్లో 8 ఇన్నింగ్స్ లలో 244 పరుగులు చేశాడు. ఇక అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫిలిప్స్ బ్యాట్ తోనే కాకుండా బాల్ తో కూడా అదరగొడుతూ ఉంటాడు.తొమ్మిది మ్యాచ్ ల్లో ఆరు వికెట్లు తీశాడు.ఇక టీము కష్టాల్లో ఉన్నప్పుడు తన బౌలింగ్ తో సహాయం చేస్తు టీమ్ ని ఆడుకోవడం ఆయనకి అలవాటు… ఇక అలాగే న్యూజిలాండ్ టీం సెమీఫైనల్ కు వెళ్ళింది కాబట్టి సెమీఫైనల్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు…
మాక్రో జాన్సన్
సౌతాఫ్రికా కి ఇందులో ఈ ప్లేయర్ 8 మ్యాచ్ ల్లో 7 ఇన్నింగ్స్ లు ఆడి 157 పరుగులు చేశాడు. అందులో ఒకటి హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఆయన బ్యాట్స్ మెన్ గానే కాకుండా బౌలర్ గా కూడా అదరగొడుతూ ఉంటాడు.ఎనిమిది మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఒక అరుదైన రికార్డు లను నెలకొల్పుతున్నాడు. మాక్రో జాన్సన్ ఆల్ రౌండర్ గా సౌతాఫ్రికా కి వరుస విజయాలను అందిస్తున్నాడు. అలాగే సెమీ ఫైనల్ లో కూడా సౌతాఫ్రికా టీం సెమీ ఫైనల్ లో గెలవడానికి మాక్రో జాన్సన్ తీవ్రమైన కృషి చేస్తాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
సమర విక్రమ
శ్రీలంక టీమ్ కి చెందిన సమరవిక్రమ 9 ఇన్నింగ్స్ లలో 373 పరుగులు చేశాడు ఇక అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. శ్రీలంక టీమ్ ఈ టోర్నీ లో పేలవమైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఇతను మాత్రం తన ప్రతిభ తో ప్రతి ఒక్కరినీ ఆకర్షించాడు…
దిల్షాన్ మధుషంక
శ్రీలంకన్ ప్లేయర్ అయిన మధుషంక తొమ్మిది మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీసి ఎవరికి సాధ్యం కానీ రీతిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఇండియా మీద శ్రీలంక ఆడిన మ్యాచులు ఆయన వేసిన ఆఫ్ కటర్ కి రోహిత్ శర్మ లాంటి గొప్ప ప్లేయర్ కూడా ఆ బాల్ ని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంటే అతని ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… ఇండియన్ టీమ్ మీద ఐదు వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు…ఇక మధుషంక ఫ్యూచర్ లో శ్రీలంక బౌలింగ్ విభాగంలో తను టాప్ ప్లేస్ లోకి వెళ్తాడు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు. అతని బౌలింగ్ యాక్షన్ గాని అతను వేసే డెలివరీలు గాని అద్భుతంగా ఉన్నాయని ప్రపంచ క్రికెట్ మేధావులు సైతం కొనియాడుతున్నారు…
జిరాల్డ్ కొటేజ్
సౌతాఫ్రికా టీంకి చెందిన ఈయన ఏడు మ్యాచ్ ల్లో 18 వికెట్లను తీసి వరల్డ్ కప్ లో తన మార్కు గుర్తింపును సంపాదించుకున్నాడు… అలాగే సౌతాఫ్రికా టీం తరఫున కీలకమైన బౌలర్ గా కూడా మారాడు సౌతాఫ్రికా ఆడుతున్న సెమి ఫైనల్ మ్యాచ్ లో కూడా ఈయన కీలకం కాబోతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి సౌతాఫ్రికా టీం లో సీనియర్ బౌలర్లు అయిన లుంగీ ఎంగిడి లాంటి బౌలర్లు ఉన్నా కూడా కోటేజ్ తన అద్భుతమైన స్పెల్ తో అద్భుతాలు చేస్తున్నాడు…
ఇక ఈ యంగ్ ప్లేయర్లు అందరూ కూడా ఫ్యూచర్ లో వాళ్ల దేశం తరుపున కీలక పాత్ర వహిస్తారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: World cup 2023 these are the young players who did wonders in the world cup
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com