ODI World Cup 2023 SA vs SL : ఏమన్నా కొట్టుడారా బై.. మన సన్ రైజర్స్ కెప్టెన్, దక్షిణాఫ్రికా వైస్ కెప్టెన్ అయిన ఎయిడెన్ మార్క్రమ్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ డికాక్ , వన్ డౌన్ బ్యాట్స్ మెన్ వాన్ డెర్ డస్సెన్ లు ఇద్దరూ సెంచరీలు బాది పటిష్ట పునాధి వేశారు. ఇక చివర్లో వచ్చిన ఐడెన్ మార్ క్రమ్ మెరుపు సెంచరీతో దక్షిణాఫ్రికాకు భారీ స్కోరును అందించాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు సెంచరీలతో విరుచుకుపడడంతో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా భారీ స్కోరుకు ముందుగా 84 బంతుల్లో 100 పరుగులతో డికాక్ పునాధి వేయగా.. ఆ తర్వాత వాన్ డర్ 108కి తోడుగా మార్క్ క్రమ్ 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా మార్ క్రమ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ కెనడా ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (50 బంతుల్లో సెంచరీ) పేరిట ఉంది.
క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మరియు ఐడెన్ మార్క్‌రామ్‌లు దంచి కొట్టడంతో సౌతాఫ్రికా 428/5 స్కోరుతో ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ రికార్డ్ స్కోరుతో ఆ క్రికెట్ జట్టు శనివారం చరిత్ర సృష్టించింది. దిల్షాన్ మధుశంక 2 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక బౌలింగ్ లైనప్ తేలిపోయింది. వారి బౌలింగ్ లో బ్యాటర్లు విపరీతంగా పరుగులు చేశారు.
అంతకుముందు, దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా కేశవ్ మహారాజ్ లాంటి స్పిన్నర్ తోపాటు నలుగురు పేసర్లతో రంగంలోకి దించగా, శ్రీలంక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, చాలా మంది ఆల్ రౌండర్లతో బరిలోకి దిగింది.
ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్ లలోనే 400 పైచిలుకు పరుగులు వచ్చాయి. వరల్డ్ కప్ లో ఇంతటి స్కోరు 428 రాలేదు. ఈ రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసి ఈ ఫీట్ సాధించింది. నిజానికి శ్రీలంక మెయిన్ బౌలర్లు గాయపడ్డారు. హసరంగ, మహేష్ తీక్షణ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు గాయాలతో బెంచ్ కే పరిమితం అవ్వడంతో శ్రీలంక బౌలింగ్ తేలిపోయింది. అదే సౌతాఫ్రికా క్యాష్ చేసుకొని భారీ స్కోరు సాధించింది.