Odi World Cup 2023: వరల్డ్ కప్ లో ఇండియా నెదర్లాండ్స్ తో ఆడే చివరి మ్యాచ్ తో లీగ్ దశ అనేది ముగిసిపోతుంది.ఇక నవంబర్ 15వ తేదీన ఇండియా, న్యూజిలాండ్ టీమ్ ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు కూడా సమానమైన బలాలను కలిగి ఉన్నప్పటికీ ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కెళ్ళి ఫైనల్లో కూడా గెలిచి కప్పు కొట్టాలని చూస్తుంది. ఇక అదే క్రమంలో 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీం తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చివరి నిమిషంలో ఇండియా ఓటమిపాలైంది…
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 239 పరుగులు చేసింది. ఇక 240 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కి వచ్చిన ఇండియన్ టీమ్ ప్లేయర్ల లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ ముగ్గురు కూడా ఒక్కో రన్ కొట్టి అవుట్ అవ్వడం ఇండియన్ టీమ్ ని భారీ కష్టాల్లోకి నెట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు కూడా చేరో హాఫ్ సెంచరీ చేసి చివరి వరకు పోరాటం చేసిన కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక దాంతో రవీంద్ర జడేజా 77 పరుగులు చేయగా, ధోని 50 పరుగుల వద్ద రన్ అయిపోయాడు ఇక ఇండియా 221 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది దాంతో 18 పరుగుల తేడాతో ఇండియా పైన న్యూజిలాండ్ ఘన విజయాన్ని సాధించింది. ఇక వాళ్ల మీద మన టీమ్ వరుస నాకౌట్ మ్యాచ్ లు ఓడిపోతు వస్తుంది. ఇక 2021 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఫైనల్ కి వచ్చి వాళ్ల చేతిలో ఓడిపోయాం…
ఇక ఇప్పుడు ఆ లెక్కలన్నీ మనకు ఎందుకు అని మనం అనుకోవచ్చు కానీ గతాన్ని గుర్తు చేసుకుంటేనే ఇప్పుడు ఆడే మ్యాచ్ మీద ప్లేయర్లకు గాని అభిమానులకు గాని కసి పెరుగుతుంది. న్యూజిలాండ్ ని ఎంత చిత్తుగా అంటే అంత చిత్తుగా ఓడిస్తేనే ఇండియన్ క్రికెట్ టీమ్ తన పవర్ ఏంటో మరొకసారి ప్రపంచ దేశాల క్రికెట్ టీమ్ లకి గుర్తు చేస్తుంది… ఇక ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే నెదర్లాండ్స్ మ్యాచ్ ని మినహాయిస్తే రెండు నాకౌట్ మ్యాచ్ లు గెలవాల్సి ఉంది. కాబట్టి ఈ రెండు మ్యాచ్ లు కూడా అద్భుతంగా ఆడి సెమీ ఫైనల్, ఫైనల్ లో విజయం సాధించి మూడోసారి ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావాలని ప్రతి ఒక్క ఇండియన్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా అదే ఆలోచిస్తున్నాడు.
ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో క్రికెట్ చూసే అభిమానుల సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే వీలైనన్ని ఎక్కువసార్లు వరల్డ్ కప్ ట్రోఫీ ని ఇండియా దక్కించుకోవాలి ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఇండియానే శాసిస్తుంది. ఇక మీదట కూడా రాబోయే చాలా సంవత్సరాల వరకు ఇండియానే టాప్ టీం గా కొనసాగిపోతుంది అనే విషయం ఇప్పటికే మనందరికీ అర్థం అయిపోయింది. ఇక దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికే ఈ వరల్డ్ కప్ ఇండియా కొట్టి చూపించాలి.ఇక ఇప్పుడు జరిగే ఈ నాకౌట్ మ్యాచ్ లు గెలిచి ఇండియన్ టీమ్ విజయం సాధించి మరొకసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునే సమయం వచ్చింది…
ఇక ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్,శ్రేయాస్ అయ్యారు ఈ ఐదుగురిలో ఏ ముగ్గురు అయిన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇవ్వాలి, ఇక బౌలర్లలో మన ముగ్గురు పేస్ బౌలర్లు అయిన బుమ్ర, షమీ, సిరాజ్ అలాగే రవీంద్ర జడేజా కూడా తనదైన పర్ఫామెన్స్ తో విజృమించాలి.అలాగే కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ తో మ్యాజిక్ చేస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుంది…ఇక ఇప్పటికే లీగ్ దశలో వాళ్ళను ఒకసారి చిత్తుగా ఓడించాం కాబట్టి అదే కాన్ఫిడెంట్ తో ఇండియన్ టీమ్ ముందుకెళ్తే ఈ మ్యాచ్ మనదే…