World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ టీం ఓపెనర్లు అయిన శుభ్ మన్ గిల్ , రోహిత్ శర్మ ఇద్దరు కూడా మొదటి నుంచి చాలా దాటిగా ఆడటం మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే సౌతాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడు.ఇక ఈ క్రమంలో 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 40 పరుగులు చేసి ఔట్ అయ్యాడు…అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడినంత సేపు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు చాలా బాగా ఆడాడు.ఇక ఈయన బ్యాటింగ్ చేస్తుంటే గ్రౌండ్ లో ఒక అమ్మాయి ఫ్లకార్డ్ పట్టుకొని ఐ లవ్ యు రోహిత్ అంటూ రచ్చ రచ్చ చేసింది.
దాంతో అది చూసిన రోహిత్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు. అలాగే ప్రస్తుతం ఆ ఫ్లకార్డ్ పట్టుకున్న అమ్మాయి ఫోటో నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి చేసిన పనికి నవ్వుకుంటున్నారు. నిజానికి రోహిత్ శర్మని అభిమానించే లేడీ ఫ్యాన్స్ ఇండియాలో చాలామంది ఉన్నారు. అందులో ఈ అమ్మాయిని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రోహిత్ శర్మ ఆడిన ఆట తీరు చూస్తే ఈ మ్యాచ్ లో పక్కాగా సెంచరీ చేస్తాడు అనుకున్నాం కానీ 40 పరుగుల వద్ద రబడ బౌలింగ్ లో బావుమా కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం అనేది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి…
ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటారు కాబట్టి ఈ రెండు టీములు కూడా వాళ్ల అధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తూన్నాయి. ఇక ఈ క్రమంలో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అవుట్ అయిన తర్వాత శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇద్దరు మ్యాచ్ ని చక్కదిద్దే పనిలో పడి వికెట్ కొల్పోకుండా స్కోరుని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఇండియన్ టీంలో ఉన్న అత్యంత బలమైన విషయం ఏంటి అంటే తొందరగా వికెట్లు పోతే నెంబర్ 3, నెంబర్ 4 లో వచ్చే బ్యాట్స్ మెన్స్ నిదానంగా ఆడి మ్యాచ్ స్కోరును చక్కదిద్దే పనిలో పడతారు. అలా కాకుండా ఓపెనర్స్ ధాటిగా ఆడి భారీ స్కోర్ చేయగలిగితే నెంబర్ త్రి , నెంబర్ ఫోర్ లో వచ్చిన ఆటగాళ్లు కూడా భారీ స్కోరు చేస్తూ దూకుడు గా ఆడతారు.
అలా మ్యాచ్ పొజిషన్ ని చూసి ఆడతారు కాబట్టే ఇండియన్ టీమ్ కి మంచి విజయాలు వస్తున్నాయి.ఇక దానికి తోడు గా ఇండియన్ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్ లో గెలిచి ఈ వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ తన మొదటి స్థానాన్ని పదిలం గా ఉంచుకోవాలని చూస్తుంది…