Jigarthanda Double X Trailer: పిజ్జా మూవీతో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ చిత్రంతో చిత్ర పరిశ్రమను ఆకర్షించాడు. జిగర్తాండ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రధాన పాత్ర చేసిన బాబీ సింహ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ నుండి మరలా ఆ రేంజ్ మూవీ రాలేదు. ఈ క్రమంలో ఆయన జిగర్తాండ డబుల్ ఎక్స్ టైటిల్ తో మరో మూవీ చేస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు చేశారు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ నవంబర్ 10న పలు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా వెంకటేష్ వెళ్లారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ చూశాక కథపై ఓ అవగాహన వచ్చింది. జిగర్తాండ 1975 నాటి కథగా తెరకెక్కింది. అంటే పీరియాడిక్ కామెడీ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు.
రజినీకాంత్ అరంగేట్రం గురించి పరోక్షంగా ఈ మూవీలో ప్రస్తావించారు. హీరో అంటే తెల్లగానే ఉండాలా? నల్లగా ఉండ కూడదా? వంటి డైలాగ్స్ ఆయన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ డైలాగ్స్ రాసింది లారెన్స్ ని ఉద్దేశించి అయినా… 70 లలో అరంగేట్రం చేసిన నల్ల హీరో రజినీకాంత్ కావడం విశేషం. ఇక తెల్ల హీరో కమల్ హాసన్ అనుకోవచ్చు. ఈ మేటర్ అటుంచితే… జిగర్తాండ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అనుకోవచ్చు దీన్ని..
రెండు కథలు ఒకేలా ఉన్నాయి. జిగర్తాండ చిత్రంలో సిద్ధార్థ్ తన సమస్య నుండి బయటపడేందుకు కరుడుగట్టిన విలన్ కి సినిమా పిచ్చి ఎక్కిస్తాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ లో సత్య జిత్ రే శిష్యుడిగా చెప్పుకునే ఎస్ జే సూర్య గ్యాంగ్ స్టర్ లారెన్స్ తో మూవీ చేయాలని అనుకుంటాడు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే డబుల్ ఎక్స్ లో పాత్రల పరిధి ఎక్కువ ఉంది. పొలిటికల్, గ్యాంగ్ వార్ కూడా ఉంది. నవీన్ చంద్ర, షైన్ టామ్ చకో విలన్స్ గా నటించారు. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. జిగర్తాండ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు…