Women’s t20 World Cup 2024: మూడు నెలల క్రితం రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై గెలుపొంది t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. దీంతో భారత అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అదరగొట్టాలని.. ఇప్పటిదాకా అందుకోలేక పోయిన ప్రపంచ కప్ దక్కించుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అయితే అది అంత సులభం కాదు. పరిమిత ఓవర్లలో ఆడే క్రికెట్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి వేరుగా ఉంటుంది. ఆడేది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా వారి అనురక్తి ఒకే విధంగా ఉంటుంది. టి20 క్రికెట్ అంటేనే వేగానికి, కొలమానం లాగా ఉంటుంది. అలాంటి సమయంలో టోర్నీ జరుగుతున్నన్నీ రోజులు అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. సరిగ్గా మూడు నెలల క్రితం జరిగిన టి20 వరల్డ్ కప్ భారత పురుషుల జట్టుకు ఒక మధురమైన జ్ఞాపకంలాగా నిలిచిపోయింది. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య హోదాలో బంగ్లాదేశ్ జట్టు స్కాట్లాండ్ తో తలపడుతుంది. తర్వాత జరిగే మరో మ్యాచ్లో పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. ఇక ఈ టోర్నీలో ఎప్పటిలాగే భారత జట్టు ఎన్నో ఆశలతో రంగంలోకి దిగుతోంది. భారత జట్టు రెండుసార్లు వన్డేలలో, ఒకసారి టి20 ఫైనల్ వెళ్లినప్పటికీ కప్ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారైనా కప్ సాధించాలని టీమిండియా భావిస్తోంది.
అంత తేలిక కాదు
భారత జట్టు గ్రూప్ – ఏ లో ఉంది. ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఆరుసార్లు ఛాంపియన్ గా అవతరించింది. ఇక మిగతా జట్లు కూడా బలంగానే ఉన్నాయి. అలాంటప్పుడు గ్రూప్ దశలో టాప్ -2 లో బలంగా నిలబడాలంటే హర్మన్ ప్రీత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా స్థిరమైన ఆటను కొనసాగించాలి. ప్రస్తుతం జట్టును చూస్తే గతంలో ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ హర్మన్ కు తోడుగా స్మృతి, షెఫాలి వర్మ, జెమిమా, రిచా లాంటి ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. దీప్తి, పూజ అటు బంతి, ఇటు బ్యాట్ తో సత్తా చాటగలరు. రేణుక, అరుంధతి, రాధా, ఆశా శోభన తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. యూఏఈ మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోగలరు. భారత జట్టు శుక్రవారం తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది. ఆదివారం పాకిస్తాన్ జట్టుతో పోటీపడుతుంది.
దక్కించుకోలేకపోయింది..
ఇప్పటివరకు ఎనిమిది మహిళ టి20 ప్రపంచ కప్ లు జరిగాయి. అయితే ఇందులో ఆరు ఆస్ట్రేలియా దక్కించుకుంది. ఆస్ట్రేలియా సాధించిన ఈ ఆరు విజయాలలో ఎలిస్ పెర్రి ముఖ్యభూమిక పోషించింది. ఇప్పుడు కూడా ఆమె బరిలోకి దిగుతోంది. ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టి20 ప్రపంచ కప్ లు ఆడిన భారత్ 2020లో మాత్రమే ఫైనల్ చేరింది. 2009, 2010, 2018, 2023లో ఎస్ఎంఎస్ వరకు వెళ్ళింది. 2012, 2014, 2016లో తొలి రౌండు లోనే నిష్క్రమించింది. ప్రస్తుత టి20 ప్రపంచకప్ లో 43 వికెట్లతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షబ్నం ఇస్మాయిల్ 43 వికెట్లు సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ బ్యాటర్ సుజి బెట్స్ 1,066 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Womens t20 world cup 2024 will team india bring the t20 world cup this time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com