Minnu Mani: కేరళ క్రికెటర్ మిన్ను మణి జీవితంలో ఎన్నో బొడిదోడుకుల్ని ఎదుర్కొని ధైర్యంతో ప్రగతి పథంలో నడుస్తోంది.వాయనాడ్‌లోని కురిచియా తెగకు చెందిన అమ్మాయి మణి .ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగినటువంటి లేడీ క్రికెటర్ల ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మణిని ₹ 30 లక్షలకు కొనుగోలు చేసింది. మరోపక్క ఆమె తన టి20 మ్యాచ్ లో కూడా అరంగేట్రం చేసింది. విజయపథంలో ముందుకు దూసుకుపోతున్న ఆమెకు తన ప్రాంతం ప్రజలు అందిస్తున్న ఆదరాభిమానాలు ప్రస్తుతం భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
మణి భారత్ క్రికెటర్ గా వెలుగులోకి వచ్చిన క్షణం నుంచి వయనాడ్ ప్రజలు ఆమెపై చూపిస్తున్నటువంటి ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ సందర్భంగా మొదట ఆమె క్రికెట్ ఎంచుకోవాలి అనుకున్నప్పుడు పడినటువంటి ఇబ్బందుల గురించి మణి పేర్కొనడం జరిగింది.”నేను మొదట్లో క్రికెట్ పై ఆసక్తి కనబరిచినప్పుడు సమాజంతో పాటు నా తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించారు. తీవ్ర విమర్శలు, ఎదురు దెబ్బలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎనిమిదవ తరగతి వరకు నేను ఎంతో రహస్యంగా మా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా స్థానిక స్థాయి మ్యాచులు ఆడుతూ వచ్చాను.”అని ఆమె పేర్కొన్నారు.

అంతేకాదు మణి తల్లిదండ్రులు ఆమె బాగా చదువుకోవాలని, ఇటు పొలం పనుల్లో కూడా ఆరితేరాలని ఆశించేవారు. తమ కూతురు కూడా తమకు వ్యవసాయంలో సహాయం చేయాలని వాళ్ల ఉద్దేశం. అయితే ఇప్పుడు ఆమె సాధించినటువంటి ఘనత చూసి
వాయనాడ్‌కు చెందిన ఒక అమ్మాయి ఇప్పుడు భారతదేశపు తరఫున ఆడుతున్నందుకు స్థానికులు సంతోషించడంతోపాటు గర్వంగా భావిస్తున్నారు.
వాళ్ల పిల్లలు కూడా ఇప్పుడు మణి అడుగుజాడల్లో నడిచి క్రికెట్ నేర్చుకోవాలని వారు అభిలాషిస్తున్నారట. తనలాగా క్రికెట్ పై ఆసక్తి ఉండి నేర్చుకోలేకపోతున్నటువంటి తన ప్రాంతం అమ్మాయిలకు సహాయం చేయడం కోసం కొంత భూమిని కూడా మంజూరు చేయమని మణి స్థానిక గవర్నేమెంట్ అధికారులను కోరడం జరిగింది. ఈ భూమిలో ఒక చిన్న పార్టీ క్రికెట్ ట్రైనింగ్ ఏరియాను నిర్మించి భవిష్యత్తులో రాబోయే భావి క్రికెటర్లకు శిక్షణ ఇవ్వాలి అని ఆమె అభిలాషస్తోంది. ఇప్పుడు ఆమెను చూసి ఎందరో ఇన్స్పిరేషన్ పొందుతున్నారు.
ఎంతో మెరుగైన ఆట ప్రదర్శించి బంగ్లాదేశ్ తో జరిగినటువంటి టి20 సిరీస్ లో ఐదు వికెట్లు పడగొట్టి ,భారత్ బౌలర్లు అందరిలో అత్యంత ఆకట్టుకున్నటువంటి
మణి పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టారు. ఉత్తర కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాడి మున్సిపాలిటీ మైసూరు రోడ్డు జంక్షన్ ఇప్పుడు ‘మిన్ను మణి జంక్షన్’గా పిలవబడుతుంది. క్రికెట్ ఆట తన జీవితాన్ని ఎంతగానో మార్చిందని.. ఒకప్పటి కూలి రైతు కుమార్తె ఇప్పుడు తన కలలను నెరవేర్చుకునే స్థితికి చేరిందని..మణి చెప్పారు.