Manchester United Stadium : బ్రిటన్ లోని ఓ ఫుట్ బాల్ మైదానాన్ని ఆధునికీకరిస్తే 81,000 కోట్ల ఆదాయం లభిస్తుందట. ఈ విషయాన్ని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ రిపోర్టు వెల్లడించింది. దీంతో బ్రిటన్ దేశంలో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓల్డ్ ట్రాపోర్డ్ మైదానం, దాన్ని చుట్టుపక్కల ఆధునికీకరించే నిర్మించే ప్రాజెక్టుకు సంబంధించి ఫీజుబిలిటీ రిపోర్టును క్లబ్ సమర్పించిందట. ఈ రిపోర్టును ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ నిర్వహించింది.. ఈ మైదానం, చుట్టు పక్కల ప్రాంతాలు గ్రేటర్ మాంచెస్టర్ ప్రాంతం ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఉపకరిస్తుందట. ఈ ప్రాజెక్టును మాంచెస్టర్ యునైటెడ్ సహజమాని, శ్రీమంతుడు జిమ్ రాట్ క్లిప్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారట. దాదాపు రెండు బిలియన్ డాలర్లు వెచ్చించి కొత్త మైదానం నిర్మిస్తారట. లేకుంటే 74,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఓల్డ్ ట్రాఫోర్ట్ సామర్థ్యాన్ని పెంచుతారట. మైదానం చుట్టుపక్కల ఉన్న అపార్ట్ మెంట్లు, వాణిజ్య సముదాయాలు, రవాణా సదుపాయాలను కల్పిస్తారట.. వీటి ద్వారా 92 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయట.. 17వేల నూతన గృహాలు నిర్మాణం జరుగుతాయట..
స్థానికుల నుంచి మద్దతు
ఈ ప్రణాళికలకు గ్రేటర్ మాంచెస్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనిపై స్థానికుల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ” ఇది గొప్ప ముందడుగు. నగరాన్ని సమూలంగా మార్చేస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. వ్యాపార సముదాయాలు ఏర్పడతాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. నగరం రూపు రేఖలు మారిపోతాయి. నగరం విస్తరించడానికి అడుగులు పడతాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ నగరానికి సరికొత్త గుర్తింపు లభిస్తుందని” మాంచెస్టర్ వాసులు చెబుతున్నారు. అయితే ఈ స్టేడియం ఆధునికీకరణ పనులను ప్రఖ్యాత ఆర్కిటెక్ సంస్థ ఫోస్టర్ పార్ట్ నర్స్ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థకు ఎంత కాంట్రాక్ట్ లభించిందనేది తెలియ రాలేదు. బ్రిటన్ దేశంలో ఎన్నో ఫుట్ బాల్ మైదానాలున్నప్పటికీ.. మాంచెస్టర్ లో నిర్మించే మైదానం చిరస్థాయిగా నిలిచిపోతుందని స్థానికులు చెబుతున్నారు. జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగీస్, వంటి దేశాల్లోనూ ఈ స్థాయిలో మైదానాలు ఉండవని వారు అంటున్నారు. ” మైదానం వల్ల కొత్త అవకాశాలు ఏర్పడతాయి. యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. స్థానికంగా సౌకర్యాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటుంది. పర్యాటకంగా గుర్తింపు లభిస్తుంది.. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి మైదానంలో ఆడే అవకాశం కలుగుతుంది.. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే బ్రిటన్ దేశం పేరు మరింత మారుమోగిపోయేదని” స్థానికులు అంటున్నారు.