Homeక్రీడలుWimbledon 2023 : బిడ్డకు జన్మనిచ్చింది.. దేశం కోసం పాటుపడింది.. ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా ...

Wimbledon 2023 : బిడ్డకు జన్మనిచ్చింది.. దేశం కోసం పాటుపడింది.. ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా వింబుల్డన్ ఎంట్రీ వేరే లెవెల్..

Wimbledon 2023 : ఉక్రెయిన్ టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా స్విటోలినా వింబుల్డన్ పోరులో అదరగొడుతోంది. గతేడాది అక్టోబర్ లో తల్లి అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన స్వీటోలినా అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుతోంది. ఈ ఏడాది ప్రారంభమయ్యే నాటికి ఆటకు పూర్తిగా దూరంగా ఉన్న 28 ఏళ్ళ స్వీటోలినా.. వరల్డ్ నెంబర్ వన్ అయిన ఇగా స్వియాటెక్ ను ఓడించి సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న స్వీటోలిన గ్రాండ్ స్లామ్ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సాధారణంగా స్వియాటిక్ ను గ్రాస్ కోర్టులో ఓడించడం అంత సులభం కాదు. కానీ అద్వితీయమైన పోరాటంతో స్వీటోలినా విజయం సాధించింది. గతంలో మూడు స్లామ్ సెమీ ఫైనల్స్ లో ఓడిపోయిన స్వీటోలినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కసితో అడుగులు వేస్తోంది. గత ఏడాది మార్చిలో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు స్వీటోలియా వెల్లడించింది. వెన్నుముక సమస్య నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, ఈ టోర్నీకి సిద్ధం కావడానికి కూడా వెన్నునొప్పి సహకరించలేదని ఆమె వెల్లడించింది. ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వింబుల్డన్ కోసం సిద్ధమైంది. ఒకపక్క దేశం కోసం పనిచేస్తూనే.. మరో పక్క ఈ మెగా టోర్నీ కోసం ఆమె సిద్దమైన తీరు క్రీడాభిమానులను ఫిదా చేస్తోంది. గత ఏడాది ఇండియన్ వెల్స్, మియామీ ఓపెన్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయినా స్వీటోలినా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది.

పునరాగమనంతో అదరగొట్టిన స్వీటోలినా..

స్వీటోలినా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి శిక్షణను ప్రారంభించింది. ఏప్రిల్ లో జరిగిన డబ్ల్యుటిఏ పర్యటనలో చార్లెస్టన్ ఓపెన్ లో ఆడింది. మొదటి రౌండులో యులియా పుతిన్సావా చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా కఠినమైన శిక్షణను తీసుకుని మళ్లీ పునరాగమనం చేసింది. ఈ ఓటమి తర్వాత 1.5 నెలల్లో తన సత్తాను చాటింది స్విటోలీనా. స్ట్రాస్ బర్గ్ లో ఫైనల్ లో అన్న లింకోవాను వరుస సెట్లలో ఓడించి టైటిల్ గెల్చుకుంది. ఈ సందర్భంగా స్విటోలినా మాట్లాడుతూ.. ఏం జరగబోతోంది అనేదానిపై తనకు అవగాహన లేదని, ప్రస్తుతం సాధించిన విజయాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆమె వెల్లడించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నట్లు తెలిపింది.

Exit mobile version