Wimbledon 2023 Carlos Alcaraz: నిండా 20 ఏళ్లు కూడా లేవు.. నూనుగు మీసాల యువకుడు.. అస్సలు అంచనాలు లేని అల్కరాస్ ఏకంగా ఇప్పటికే టెన్నిస్ లో యోధుడుగా 20 టైటిళ్లకు పైగా సాధించిన జకోవిచ్ ను ఓడించడాడు. గత పది సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతున్న క్లేకోర్టు కింగ్ జకోవిచ్ ను మట్టికరిపించాడు. అసలు ఎవరీ అల్కరాస్.. అతడు ఎలా సాధించాడు? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
ఓటమి అన్నదే లేదు
సెంట్రల్ కోర్టులో జకోవిచ్ కు ఓటమి అన్నదే లేదు. గత పది సంవత్సరాలుగా అతడు అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్నాడు. ఇలా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఎదురు అన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు. కానీ అతడి గెలుపు యాత్రను 20 సంవత్సరాల కుర్రాడు అడ్డుకున్నాడు. ఐదు సెట్లపాటు వీరోచితంగా ఆడాడు. వింబుల్డన్ ఫైనల్లో ఛాంపియన్ కు చుక్కలు చూపించాడు. ఎదురొడ్డి నిలిచాడు. మొదటి సెట్ కోల్పోయినప్పటికీ తీరంపై విరుచుకుపడిన అలలా.. జొకోవిచ్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అంతేకాదు తన కెరియర్లో తొలి వింబుల్డన్ ట్రోఫీ అందుకొని మురిసిపోయాడు. అతడే 20 సంవత్సరాల కార్లోస్ అల్కరాస్. కార్లోస్ ఆట దెబ్బకు జొకో విచ్ కంటతడి పెట్టాడు.
వింబుల్డన్ ప్రారంభమైన నాటి నుంచే..
వింబుల్డన్ ప్రారంభమైన నాటి నుంచే ప్రం పంచ నెంబర్ 2 ర్యాంకు ఆటగాడు జొకో విచ్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు. ఫైనల్ వేట వరకు సునాయాసంగా విజయాలు సాధించుకుంటూ వచ్చాడు. ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ దేశానికి చెందిన ఆల్కరాస్ 1_6, 7_6(8/6),6_1,3_6,6_4 తో గెలిచి సరికొత్త విజేతగా నిలిచాడు. టైటిల్ అందుకున్న ఈ 20 ఏళ్ల యువ సంచలనానికి ఇది రెండవ గ్రాండ్ సలాం. గత ఏడాది చివరిలో యూఎస్ ఓపెన్ సాధించాడు. అయితే అటు పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచి ఓవరాల్ గా మార్గరెట్ కోర్టు (24) రికార్డు సమం చేద్దామనుకున్న జొకోవిచ్ కు నిరాశ మిగిల్చాడు. అలాగే ఈ విజయంతో ఆల్కరాస్ ఇదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సెమిస్ లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. నాలుగు గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ ఫైనల్ లో అల్కరాస్ 9 ఏస్ లు, జొకో విచ్ 2 ఏస్ లు సంధించారు.
జొకో విచ్ దే అనుకున్నారు
తొలి సెట్ లో జొకో విచ్ దే ఆధిపత్యం సాగింది. ఒక దశలో రెండు బ్రేక్ పాయింట్లు సాధించి వరుసగా ఐదు గేములు గెలిచాడు. అల్కా రాస్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఆరవ గేమ్ లో అల్క రాస్ గేమ్ సర్వీస్ కాపాడుకున్నప్పటికీ జొకో 34 నిమిషాల్లోనే 6_1 తేడాతో సెట్ ముగించాడు. ఇక్కడి నుంచి ఆటస్వరూపం పూర్తిగా మారిపోయింది. తొలి సెట్ కోల్పోయిన అల్కా రాస్ దెబ్బతిన్న బెబ్బులీ లాగా జొకో విచ్ పై ఎదురు దాడి చేశాడు. మొదట జొకో విచ్ సర్వీస్ బ్రేక్ చేశాడు. 2_0 తేడాతో జోరు చూపించాడు.. మూడవ గేమ్ లో 40_30 తో పైచేయిలో ఉన్నప్పటికీ జొకో విచ్ పట్టు విడవలేదు. బ్రేక్ సాధించడమే కాకుండా, సర్వీస్ కాపాడుకోవడంతో 2_2 తో పోటీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ 6_6 తో నిలవడంతో టై బ్రేకర్ తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ కు ముందు వరుసగా టై బ్రేక్లు గెలిచిన జొకో విచ్ కు షాక్ ఇస్తూ అల్కా రాస్ 7_6 తో రెండవ సెట్ దక్కించుకున్నాడు. ఇదే ఊపులో మూడో సెట్ తొలి గేమ్ లోనే బ్రేక్ పాయింట్ తో పాటు సర్వీస్ కాపాడుకోవాలని అల్కరాస్ 2_0 తో ముందంజ వేశాడు . మూడో గేమ్ లో జొకో విచ్ తొలి పాయింట్ సాధించాడు. ఇక 13 డ్యూస్ లతో అరగంట పాటు సాగిన ఐదో గేమ్ ఉత్కంఠ రేపింది. అయితే అల్కా రాస్ ఈ సెట్ ను 6_1 తో గెలుచుకున్నాడు. నాలుగో సెట్ ను జొకో విచ్ బ్రేక్ పాయింట్ తో నెగ్గడంతో మ్యాచ్ మరింత రసవతరంగా మారింది.
నిర్ణాయక సెట్ లో..
ఇక నిర్ణాయక సెట్ లో బ్రేక్ పాయింట్ తో అల్కా రాస్ 2_1 తో దూసుకెళ్లాడు. ఐదో ఐదో గేమ్ గెలుచుకున్న జొకో విచ్.. ఆరో గేమ్ లో ఒత్తిడికి గురయ్యాడు. పదేపదే కోర్టు బయటకు షాట్లు ఆడి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇక 9వ గేమ్ అలవోకగా గెలుచుకున్న జొకో.. ఛాంపియన్షిప్ సర్వీస్ తో పెద్దగా ఒత్తిడి లేకుండానే ఆల్కారస్ పదవ గేమ్ ముగించాడు. వింబుల్డన్ ట్రోఫీని సగర్వంగా ఎగరేసుకుపోయాడు.