Samajavaragamana Collections: ‘ఈ ఏడాది లో నిర్మాత దగ్గర నుండి బయ్యర్స్ , ఎక్సిభిటర్స్ వరకు ప్రతీ ఒక్కరు జేబు నుండి పైసలు నింపుకునేలా చేసిన సినిమాల లిస్ట్ చాలా తక్కువ. వాటిల్లో రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’ కూడా ఒకటి. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై , ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రానప్పటికీ లాంగ్ రన్ లో దుమ్ము లేపిన చిత్రం గా నిల్చింది.
వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న శ్రీ విష్ణు కి, ఏజెంట్ చిత్రం తో భారీ నష్టాలను చూసిన నిర్మాత అనిల్ సుంకర కి ఈ చిత్రం ఇచ్చిన రిలీఫ్ మామూలుది కాదు. చాలా కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఆహ్లాదకరమైన కామెడీ ని ఎంజాయ్ చేసారు. ఇప్పటికీ ఈ చిత్రం విడుదలై మూడు వారాలు అయ్యింది. ఈ మూడు వారాల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 3 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా కేవలం నైజాం ప్రాంతం నుండే 3 వారాల్లో 4 కోట్ల 50 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. చాలా అరుదుగా జరిగే సంఘటనలు ఇవి. అలాగే సీడెడ్ లో కోటి 10 లక్షల రూపాయిలు , ఉత్తరాంధ్ర లో కోటి 75 లక్షల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 77 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 54 లక్షల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 72 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 75 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 41 లక్షలు రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పది కోట్ల రూపాయిల షేర్, కర్ణాటక , ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 14 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.