IND vs PAK : పాకిస్థాన్ ట్రాప్ లో కోహ్లీ పడతాడా..? ఈ మ్యాచ్ లో కీలకంగా మారిన ఆ ప్లేయర్లు…

కోహ్లీ పాకిస్థాన్ మీద ఆడిన 14 మ్యాచ్ లను కనక చూసుకుంటే అందులో 45 సగటుతో, 96 స్ట్రైక్ రేట్ తో మంచి స్కోర్ సాధించాడు.

Written By: NARESH, Updated On : September 10, 2023 12:15 pm

rohit-kohli-shaheen

Follow us on

INDIA vs PAKISTAN : ఏషియా కప్ లో ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ చాలా భారీ ప్లాన్లు వేస్తున్నట్టు గా తెలుస్తోంది… ఇండియన్ క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని శాసిస్తున్న విరాట్ కోహ్లీ ని తొందరగా ఔట్ చేయడానికి చాలా ప్లాన్లు వేస్తున్నారు…మొన్న జరిగిన మ్యాచ్ ని వదిలేస్తే ఈ మ్యాచ్ లో అయితే కోహ్లీ అంత తేలిగ్గా వీళ్ళకి చిక్కడు అనే విషయం వాళ్ళకి తెలీదు… వాళ్ల స్ట్రాటజీ ప్రకారం కోహ్లీ ని తొందరగా ఔట్ చేస్తే ఇండియా ఎక్కువ స్కోర్ చేయడం చాలా వరకు కష్టం అవుతుంది అందుకే కోహ్లీ ని ఎర్లీ గా ఔట్ చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. అయితే వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే మన ఓపెనర్ బ్యాట్స్ మెన్స్ ని తొందర గా ఔట్ చేసి వీలైనంత తొందరగా అంటే పవర్ ప్లే లోనే కోహ్లీ ని రప్పించి ఔట్ చేస్తే ఇండియాని కష్టాల్లోకి నెట్టిన వాళ్ళం అవుతాం అని అనుకుంటున్నారు అయితే కోహ్లీ పాకిస్థాన్ మీద అంత తొందర గా అవుట్ అవుతాడా..?అసలు ఈ పిచ్ లో కోహ్లీ కి ఎలాంటి రికార్డ్ ఉంది అనేది మనం తెలుసుకుందాం…

కోహ్లీ పాకిస్థాన్ మీద ఆడిన 14 మ్యాచ్ లను కనక చూసుకుంటే అందులో 45 సగటుతో, 96 స్ట్రైక్ రేట్ తో మంచి స్కోర్ సాధించాడు. ఇక నాలుగు సార్లు 75 కి పైన రన్స్ చేశాడు కానీ ఏడు సార్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు అయితే ఇది కూడా ఎర్లీ గా క్రీజ్ లోకి వచ్చి ఔట్ అయినవే ఎక్కువ గా ఉన్నాయి…అంటే కొత్త బంతిని ఎదురుకోవడంతో లో కోహ్లీ చాలా వరకు తడబడుతున్నట్టు గా తెలుస్తుంది…

అయితే కోహ్లీ ని ఇదే పద్దతిలో ఇప్పుడు కూడా ఔట్ చేయడానికి పాకిస్థాన్ టీమ్ భారీ స్కెచ్ వేసినట్టు గా తెలుస్తుంది…మరి వాళ్ల ట్రాప్ లో కోహ్లీ పడతాడా లేదా అనేది చూడాలి…ఇక కోహ్లీకి ఈ గ్రౌండ్ లో మంచి రికార్డ్ లే ఉన్నాయి.ఇక అందులో భాగంగానే ఈ గ్రౌండ్ లో 8 మ్యాచ్ లు ఆడితే అందులో 104 అవరేజ్ తో చాలా చక్కటి ఇన్నింగ్స్ లను ఆడినట్లు గా తెలుస్తుంది… అలాగే అందులో మూడు సెంచరీ లు కూడా ఉన్నాయి…

అయితే కోహ్లీ లెగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం లో దిట్ట అనే చెప్పాలి. గడిచిన రెండు సంవత్సరాలలో ఆయన ఒక్కసారి మాత్రమే లెగ్ స్పిన్నర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కాబట్టి పాకిస్థాన్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన షాదాభ్ ఖాన్ బౌలింగ్ లో ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారించడం ఖాయం అనే చెప్పాలి… అయితే ఒకసారి పాకిస్థాన్ ప్లేయింగ్ లేవన్ ఎలా ఉంది మన ప్లేయింగ్ లేవన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం..

ముందుగా పాకిస్థాన్ టీమ్ లో ఉన్న ప్లేయర్ల విషయానికి వస్తే.. ఓపెనర్లుగా ఫకార్ జమన్, ఇమామ్ ఉల్ హక్ ఉన్నారు వీళ్లిద్దరూ కూడా మంచి బ్యాట్స్ మెన్స్…ఇక నెంబర్ త్రీ లో బాబర్ అజం ఉన్నాడు నెంబర్ ఫోర్ లో మహమ్మద్ రిజ్వన్ ఉన్నాడు నెంబర్ ఫైవ్ లో అఘ సల్మాన్ ఉన్నాడు నెంబర్ సిక్స్ లో ఇఫ్తికర్ అహ్మద్ ఉన్నాడు నెంబర్ సేవన్ లో షాదభ్ ఖాన్, నెంబర్ ఎయిట్ లో మహమ్మద్ నవాజ్,నెంబర్ నైన్ లో షాహిన్ అఫ్రిది,నెంబర్ టెన్ లో నశీం షా,నెంబర్ లేవన్ లో హరీష్ రాఫ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు…పాకిస్థాన్ టీమ్ మాక్సిమమ్ ఇదే టీమ్ తో బరిలోకి దిగుతుంది…అయితే మన బౌలర్లు పాకిస్థాన్ టీమ్ లోని మొదటి నలుగురు బ్యాట్స్ మెన్స్ ని తొందరగా ఔట్ చేస్తే మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది ఎందుకంటే వాళ్ళు నలుగురు మాత్రమే పాకిస్థాన్ టీమ్ టాప్ బ్యాట్స్ మెన్స్ వాళ్ళు ఔట్ అయితే ఈ టీమ్ భారీ స్కోరు చేయడం లో చాలా వరకు ఇబ్బంది పడుతుంది…అందుకే మన బౌలర్ల ఫోకస్ మొత్తం ఆ నలుగురి మీద ఉంటే సరిపోతుంది…ఇక ఒకసారి మన ప్లేయింగ్ లేవన్ ను కనక చూసుకుంటే…

ఓపెనర్లు గా రోహిత్ శర్మ, శుభామాన్ గిల్ ఉన్నారు ఇక నెంబర్ త్రి లో కోహ్లీ, ఫోర్ లో శ్రేయాస్ అయ్యర్, ఫైవ్ లో ఇషాన్ కిషన్, సిక్స్ లో హార్దిక్ పాండ్య, సెవన్ లో రవీంద్ర జడేజా, ఎయిట్ లో అక్షర్ పటేల్, నైన్ లో మహమ్మద్ సిరజ్, టెన్ లో కుల్డిప్ యాదవ్, లెవన్ లో జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు…

అయితే శార్థుల్ టాకుర్ ప్లేస్ లో ఎందుకు అక్షర్ పటేల్ ని తీసుకోవాలి అంటే ఇది స్పిన్ పిచ్ కాబట్టి ఆయనని తీసుకోవడం టీమ్ కి చాలా అవసరం. అలాగే శార్ధుల్ టాకుర్ ప్లేస్ లో బౌలింగ్ చేయడానికి హార్దిక్ పాండ్య కూడా ఉన్నాడు కాబట్టి మనకు స్పెషల్ గా శార్ధుల్ టాకుర్ అవసరం లేదనే చెప్పాలి…

ఇక ఈ మ్యాచ్ లో మన టీమ్ ఎక్కువ స్కోర్ చేయాలంటే మాత్రం ఓపెనర్లు కొంచం ఎక్కువ సేపు క్రీజ్ లో ఉంటే మంచిది ఎక్కువ గా స్కోర్ చేయకపోయినా కూడా వికెట్ కాపాడుకుంటూ పవర్ ప్లే అయిపోయేదాక ఒక వికెట్ పోకుండా వికెట్ ని కాపాడితే ఆ తర్వాత నుంచి వాళ్ల మీద కౌంటర్ ఎటాక్ కి దిగి ఎక్కువ స్కోర్ చేయవచ్చు…అందుకే ఈ మ్యాచ్ లో ఇండియా కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ బ్యాటింగ్ బాగా చేస్తే ఈజీగా ఈ మ్యాచ్ గెలవవచ్చు…

ఇక మ్యాచ్ లో ఇషాన్ కిషన్, హార్దిక పాండ్య, రవీంద్ర జడేజా లు కూడా చాలా కీలకమైన ప్లేయర్లు గా మారబోతున్నారు…