BCCI: ప్రపంచ క్రికెట్ లో అనేక మార్పులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ దోహద పడింది. ఐపీఎల్ వచ్చిన తర్వాత వందలాది మంది క్రికెటర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. అభిమానుల అభిరుచులకు అనుగుణంగానే ఐపీఎల్ లోను మార్పులు చేసుకుంటూ వస్తున్నారు నిర్వాహకులు. దీంతో ఐపీఎల్ ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ అభిమానుల ఆదరణను పొందుతోంది ఈ లీగ్. ఈ క్రమంలోనే ఐపీఎల్ రేంజ్ పెంచేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయంతో అభిమానులు మజా తారాస్థాయికి చేరడంతోపాటు ఆటగాళ్లకు కూడా లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో ప్లేయర్ల కోసం ఖర్చు పెట్టే మొత్తాన్ని మరింత పెంచనున్నట్లు బీసీసీఐ తెలిపింది. గడిచిన ఏడాది మినీ వేలానికి ముందు కూడా ప్రాంచైజీ పర్సు వాల్యూను బీసీసీఐ పెంచింది.
కోట్లాదిమంది అభిమానుల ఆదరణను పొందుతున్న ఐపీఎల్ లో మరిన్ని మార్పులు చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాంచైజీలు ఆటగాళ్ల కోసం వెచ్చించే మొత్తాన్ని భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ప్రాంచైజీల పర్సు వ్యాల్యూను 100 కోట్లకు పెంచాలని బిసిసిఐ భావిస్తోంది. వచ్చే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో ప్రాంచైజీలు అన్నీ కూడా కొత్త పర్సు విలువలతో వేలం బరిలో దిగనున్నాయి.
మిగిలిన ఆటగాళ్లకు మాత్రమే వేలం..
ఆయా జట్ల మేనేజ్మెంట్లు ఎంతమంది కావాలంటే అంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఈసారి ఉంటుందని చెబుతున్నారు. రిటైన్ చేసుకోగా మిగిలిన ఆటగాళ్లకు మాత్రమే వేలం నిర్వహించనున్నారు. క్రిస్మస్ సెలవుల సమయంలో వేలం నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆ పండుగ ముగిసిన తర్వాత వేలం నిర్వహించనున్నారు. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వేలం నిర్వహించే తేదీలను ప్రకటించనున్నది బీసీసీఐ. ఈ వేలం నిర్వహించే వేదికను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ప్రస్తుతం బిజీగా ఉంది. జైపూర్, అహ్మదాబాద్, కొచి, కోల్కతా నగరాలను దీనికోసం షార్ట్ లిస్టు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఏదో ఒక నగరంలో వేలం నిర్వహించనున్నారు. గడిచిన ఏడాది కొచి నగరంలో ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఆ వేలంలో పది ప్రాంచైజీలు కలిపి 167 కోట్లు ఖర్చు చేసి 80 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ ఏడాది ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Web Title: Will the ipl range increase from next season what is bcci plan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com