Sania Mirza and Shoaib Malik : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంసారంలో కలతలు వచ్చినట్లు చెబుతున్నారు. వారి సంసారంలో మనస్పర్ధలు చోటుచేసుకున్నాయనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇద్దరు నువ్వాదరిని నేనీ దరిని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇద్దరు వేరుగా ఉంటున్నట్లు పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా ఎందుకు అలా చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా మారిందని పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

2010లో పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. గత కొన్నాళ్లుగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సానియా, మాలిక్ ల మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరంగా ఉంటున్నారు? వారి మనస్పర్దలకు కారణాలేంటి అనే కోణంలో పలు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఎల్లలు దాటిన వీరి ప్రేమ పన్నెండేళ్లకే తారుమారు కావడం అందరిలో సందేహాలు రావడం మామూలే.
సానియా మీర్జా డబుల్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఆమె ఖాతాలో 6 డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉండటం విశేషం. టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 100కి చేరుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా పాకిస్తాన్ కోడలు అయింది. షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహ సమయంలో ఎంతో మంది సానియా తీరుపై విమర్శలు చేసినా ఆమె షోయబ్ ను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. అనుకున్నది సాధించింది.
సానియా, మాలిక్ కు ఓ మగబిడ్డ 2018లో జన్మించాడు. కానీ వారి మధ్య ఏవో గొడవలు చోటుచేసుకుని వేరుగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి మాలిక్ మాత్రమే ఫొటోలు పోస్టు చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. దీనిపై సానియా ఏ సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో వీరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నాళ్లుగా సానియా దంపతులు విడిగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో వారి మధ్య ఎందుకు మనస్పర్దలు వచ్చాయి. ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఏమైందనే కారణాలు వినిపిస్తున్నాయి.
సానియా, మాలిక్ త్వరలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో వీరి మధ్య చోటుచేసుకున్న తగాదా ఏంటనే దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో వారి వైవాహిక జీవితం అర్థంతరంగా ఎందుకు ముగిసిపోతుంది? వారి సంసారం కకావికలం కావడానికి కారణాలేంటనే దానిపై అందరు ఆసక్తిగా ఉన్నా తెలియడం లేదు. మొత్తానికి వారి సంసారం ముక్కలు కావడానికి గల పరిస్థితులు త్వరలో తెలుస్తాయని నమ్ముతున్నారు.