RCB: 2009 డెక్కన్ ఛార్జర్స్ చేసిన మ్యాజిక్ ను ఇప్పుడు ఆర్సిబి చేస్తుందా..?

ముఖ్యంగా వాళ్లు ఆడిన 6 మ్యాచ్ లను కనక చూసుకుంటే అందులో ఒక్కో ప్లేయర్ ఒక్కో టైమ్ లో రాణిస్తూ మ్యాచ్ ను కీలకమైన మలుపు తిప్పుతూ మంచి విజయాలను సాధించడంలో కీలక పాత్ర వహించారు.

Written By: Gopi, Updated On : May 19, 2024 11:06 am

RCB

Follow us on

RCB: ఐపీఎల్ సీజన్ 17 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఫస్టాఫ్ లో ఆడిన మ్యాచుల్లో ఏమాత్రం సత్తా చూపించలేకపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం వాళ్లు బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా వరుసగా 6 విజయాలను నమోదు చేసుకొని ప్లే ఆఫ్ కి చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈసారి వీళ్ళు కప్పు కొడతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమం లోనే 2009వ సంవత్సరంలో గిల్ క్రిస్ట్ సారధ్యంలో ‘డెక్కన్ చార్జర్స్’ టీం కూడా ఇలానే చివరి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకున్నారు.

ఆ సంవత్సరం వాళ్ళు టైటిల్ ను కూడా ఎగరేసుకుపోయారు. మరి ఇప్పుడు బెంగళూరు టీమ్ కూడా అదే విధంగా వరుసగా 6 మ్యాచులను గెలిచి ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. మరి వీళ్ళు కూడా మిగిలిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి డెక్కన్ చార్జర్స్ టీం ఎలాగైతే కప్పు కొట్టిందో ఇప్పుడు ఈ టీమ్ కూడా అలానే కప్పు గెలవబోతుందా అంటూ పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బెంగళూరు టీమ్ లో ఉన్న ప్లేయర్లందరూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండటం ఆ టీం కి చాలా వరకు కలిసి వస్తుంది.

ముఖ్యంగా వాళ్లు ఆడిన 6 మ్యాచ్ లను కనక చూసుకుంటే అందులో ఒక్కో ప్లేయర్ ఒక్కో టైమ్ లో రాణిస్తూ మ్యాచ్ ను కీలకమైన మలుపు తిప్పుతూ మంచి విజయాలను సాధించడంలో కీలక పాత్ర వహించారు. ఇక గతం జరిగిన విషయాలను కనక ఒకసారి చూసుకుంటే డెక్కన్ చార్జెస్ రిపీట్ చేసిన మ్యాజిక్ ని మరోసారి బెంగళూరు టీమ్ కూడా రిపీట్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే కలకత్తా, రాజస్థాన్, హైదరాబాద్ టీమ్ లు చాలా మంచి ఫామ్ లో ఉన్నాయి. వాటిని చిత్తు చేసేంత కెపాసిటీ బెంగుళూరు టీమ్ కి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇంతకుముందు బెంగళూరు టీమ్ నాకౌట్ మ్యాచ్ ఆడుతుందంటే అందులో ఉన్న ప్లేయర్లందరు ప్రేజర్ తట్టుకోలేక చేతులెత్తేసేవారు. కానీ నిన్న జరిగిన నాకౌట్ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి టీమ్ స్పిరిట్ తో విజయాన్ని సాధించారు. కాబట్టి ఇకమీదట కూడా ఆర్సిబి ఆడే ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచే కాబట్టి ఇక మిగిలిన మూడు మ్యాచ్ ల్లో కూడా విజయం సాధిస్తే కప్పు కైవసం చేసుకోవచ్చు…