Homeక్రీడలుక్రికెట్‌Pakistan World Cup chances: పాకిస్తాన్ కప్ గెలవదా? పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆస్ట్రేలియా కెప్టెన్...

Pakistan World Cup chances: పాకిస్తాన్ కప్ గెలవదా? పాక్ జర్నలిస్ట్ ప్రశ్నకు ఆస్ట్రేలియా కెప్టెన్ పరువు తీశాడుగా..

Pakistan World Cup chances: ఏ ముహూర్తంలో అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టు టి20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడదని చెప్పిందో అప్పటినుంచి మొదలైంది.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ చూసే అభిమానులు.. క్రికెట్ ఆడే ప్లేయర్లు.. క్రికెట్ ఆడి విశ్రాంతి ప్రకటించిన ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మార్ష్ ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ జట్టు మొత్తం తీసేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

లేనిపోని కారణాలను సాకుగా చూపించి పాకిస్తాన్ ప్రభుత్వం టి20 వరల్డ్ కప్ లో తమ జట్టు కొలంబో వేదికగా భారత జట్టుతో పోటీ పడదని చెప్పేసింది. ఇక అప్పట్నుంచి పాకిస్తాన్ జట్టు పరువు సోషల్ మీడియా వేదికగా.. ప్రధాన మీడియా వేదికగా పోతూనే ఉంది. చాలామంది క్రికెట్ విశ్లేషకులు పాకిస్తాన్ దేశం వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. పాకిస్తాన్ దేశం క్రీడా స్ఫూర్తిని పూర్తిస్థాయిలో మంట కలిపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ దేశం తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ క్రికెట్ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ పాకిస్తాన్ దేశం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టాడు.” పాకిస్తాన్ భారత జట్టుతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది. దీనిని బట్టి మీరు ఏమనుకుంటున్నారు.. మీ అభిప్రాయాన్ని ఏ విధంగా చెబుతారు.. ఒక క్రికెటర్ గా ఎలా స్పందిస్తారు” అని పాకిస్తాన్ విలేకరులు మార్ష్ ను ప్రశ్నించారు.

” మేము టి20 వరల్డ్ కప్ పై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఇతరులు ఏం చేస్తారనేది మాకు తెలియదు. దాని గురించి కూడా మేము పెద్దగా పట్టించుకోము. మాకు కావాల్సింది కేవలం క్రికెట్ మాత్రమే. మా ఆటగాళ్లు కేవలం ప్రదర్శన మీద మాత్రమే దృష్టి పెడతారు. భారత్, శ్రీలంక లో జరిగే టి20 వరల్డ్ కప్ మాకు అత్యంత ముఖ్యమైనది. ఇందులో మా స్థాయి ఆట తీరు ప్రదర్శించి.. అనుకూలమైన ఫలితంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. అలాంటప్పుడు మిగతా వాటి గురించి మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని” మార్ష్ వ్యాఖ్యానించాడు.

మార్ష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డమీద.. పాకిస్తాన్ దేశం చేసిన తప్పును మార్ష్ ఎండగట్టారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ జట్టు బుద్ధి తెచ్చుకోవాలని.. క్రికెట్లో రాజకీయాలను చొప్పించే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version