spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan : బీసీసీఐ సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తొలగిస్తే.. అతడేమో సెంచరీ చేసి చూపించాడు.....

Ishan Kishan : బీసీసీఐ సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తొలగిస్తే.. అతడేమో సెంచరీ చేసి చూపించాడు.. ఇప్పటికైనా జట్టులో అవకాశం లభిస్తుందా?

Ishan Kishan :  అనంతపురం వేదికగా ఇండియా – బీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. కేవలం 120 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. గాయం వల్ల ఇషాన్ కిషన్ మొదటి రౌండ్ మ్యాచ్ ఆడ లేకపోయాడు. రెండవ రౌండ్లో ఇండియా – సీ జట్టు తరుపున మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.. ఆ తర్వాత తన వేగాన్ని తగ్గించుకున్నప్పటికీ చివరికి మూడు అంకెల స్కోర్ సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి ఇషాన్ కిషన్ ఇండియా – డీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్న సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. ఇక బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీని వీడి వెళ్లిపోయారు. దీంతో కిషన్ ఇండియా – సీ జట్టు ద్వారా అతడు బరిలోకి దిగాడు.

టాస్ ఓడిపోయిన ఇండియా – సీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే ప్రారంభంలోనే ఆ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ గాయం వల్ల రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు. ఈ దశలో రజత్ పాటిదార్(40: 67 బంతుల్లో 8 ఫోర్లు) మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (43: 75 బంతుల్లో 8 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. అయితే వీరిద్దరూ హాఫ్ సెంచరీలకు దగ్గరవుతున్న క్రమంలో ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ బౌలింగ్ లలో వెను తిరిగారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ క్రీజ్ లోకి వచ్చాడు. మూడంకెల స్కోర్ చేశాడు.

జట్టులో చోటు కల్పిస్తారా..

ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేదు. అతడు దేశవాళి క్రికెట్ ఆడక పోవడంతోనే సెంట్రల్ కాంటాక్ట్ నుంచి పేరు తొలగించామని బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. మరో వైపు టి20 వరల్డ్ కప్ లోనూ అతనికి అవకాశం లభించలేదు. ఇటీవలి శ్రీలంక పర్యటనలోనూ అతడికి రిక్తహస్తమే ఎదురయింది. బంగ్లాదేశ్ సిరీస్ లోనూ అతని పేరు సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆ బాధను మొత్తం భరిస్తూ ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. మరి ఇప్పటికైనా టీమ్ ఇండియా సెలక్టర్లు వచ్చే టోర్నీలలో కిషన్ కు అవకాశం కల్పిస్తారా? అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper