Odi World Cup 2023: ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఉన్న ఫామ్ ని చూస్తుంటే వరల్డ్ లో మిగిలిన అన్ని టీమ్ లు కూడా భయం తో వణికిపోతున్నాయి. ఇక ఈనెల 22వ తేదీన ఇండియా న్యూజిలాండ్ తో ఆడే మ్యాచ్ లో ఇండియన్ టీమ్ లో భారీ మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇండియా ఈ మ్యాచ్ లో కూడా తనదైన గుర్తింపు ను చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.ఇక దాంతో పాటు గా ఇది ఇండియన్ టీమ్ కి రివెంజ్ తీర్చుకునే మ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే 2019 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో ఇండియన్ టీమ్ న్యూజిలాండ్ మీద ఓడిపోవడం జరిగింది.
ఇక దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది.ఇక ఇప్పటికే ఇండియన్ టీమ్ వరుసగా నాలుగు విజయాలను అందుకుని మంచి దూకుడు మీద ఉంది అద్బుతం గా ఆడుతూ ఇండియన్ టీమ్ కి అలవోకగా విజయాలను అందిస్తూన్న నేపథ్యం లో ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లు గాయాల బారిన పడటం వల్ల ఈ ప్లేయర్ ల ప్లేస్ లో మళ్లీ ఏ ప్లేయర్లను తీసుకోవాలి అనే ఆలోచనలో ఇండియన్ టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ టోర్నీ లో పాయింట్స్ టేబుల్ లో ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. దాదాపు అన్ని టీమ్ ల మీద ఆధిపత్యాన్ని చేలాయించే విధంగానే కనిపిస్తుంది.
కానీ న్యూజిలాండ్ టీమ్ కూడా ఇండియా టీమ్ లానే వరుసగా నాలుగు విజయాలను అందుకొని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 పోజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఇప్పుడు న్యూజిలాండ్ టీం మీద కనక ఇండియన్ టీం గెలిస్తే ఈ టోర్నీ లో ఇండియా కి తిరుగు ఉండదనే చెప్పాలి.
పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతున్న ఈ రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండనున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ రెండు టీముల్లో ఎవరు ఎవరిపైన ఆధిపత్యం చేలాయిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్ అయినా హార్థిక్ పాండ్య కి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం అవ్వడం జరిగింది. ఇక దాంతో ఆయన టీం లో ఉంటాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి పరిస్థితిలో ఇండియా న్యూజిలాండ్ మీద ఆడే మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఆడకపోతే ఆయన ప్లేస్ లో ఏ ప్లేయర్ ని ఆడిస్తారు అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
హార్దిక్ పాండ్యా ప్లేస్ లోకి అక్షర్ పటేల్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే హర్ధిక్ పాండ్య ఈ మ్యాచ్ వరకు క్యూర్ అయితే తనే ఆడుతాడు లేదా అక్షర్ పటేల్ అడుతాడు అయితే హార్దిక్ పాండ్య ప్లేస్ లోకి అక్షర్ పటేల్ కనక టీం లోకి వస్తే హర్ధిక్ ప్లేస్ ని రీప్లేస్ చేయగలడా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే హార్థిక్ పాండ్య అయితే బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో రెండిటిలో రాణిస్తూ ఇండియన్ టీమ్ కి ఒక బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో టీమ్ లోకి అక్షర్ పటేల్ వస్తే ఏ మాత్రం టీమ్ కి ప్లస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ టీం ప్లేయింగ్ 11 లో ఎవరేవరు ఆడుతున్నారో ఒకసారి తెలుసుకుందాం…
ఓపెనర్లు గా శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు.ఇక ఆ తర్వాత నెంబర్ త్రీ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక ఈయన ఆల్రెడీ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో సెంచరీ చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.ఇక నెంబర్ ఫోర్ లో శ్రేయస్ అయ్యర్,నెంబర్ 5 లో కేల్ రాహుల్ ,నెంబర్ 6 లో హార్థిక్ పాండ్యా ,నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ ఎయిట్ లో రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్, నెంబర్ 9 లో కుల్దిప్ యాదవ్, నెంబర్ 10 లో జస్ప్రిత్ బుమ్రా, నెంబర్ 11 లో మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లతో ఇండియా బరిలోకి దిగనుంది.ఇక హర్ధిక్ పాండ్య ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే బీసీసీఐ ఇప్పటివరకు కూడా హార్దిక్ పాండ్యా కు తగిలిన గాయం మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి హార్దిక్ పాండ్యా టీంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇక ఈ మ్యాచ్ లో గెలుపు అనేది ఇండియా కి కీలకం కాకపోయినా ఈ మ్యాచ్ లో కనక గెలిస్తే మన టీమిండియా ని తట్టుకునే జట్టు వరల్డ్ కప్ టోర్నీ లో లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది… అలాగే లాస్ట్ టైమ్ బాకీ పడిపోయిన మ్యాచ్ గెలిచి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి…