SA Test Series: దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ లో విజయం సాధించేనా? చిరకాల వాంఛ తీరేనా?

SA Test Series: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. నేటి నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సమాయత్తమైంది. విరాట్ కోహ్లిని వన్డే జట్టు నుంచి తప్పించిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. కానీ టెస్ట్ కెప్టెన్ గా మాత్రం కోహ్లినే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ […]

Written By: Srinivas, Updated On : December 26, 2021 7:17 pm
Follow us on

SA Test Series: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. నేటి నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు సమాయత్తమైంది. విరాట్ కోహ్లిని వన్డే జట్టు నుంచి తప్పించిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది. కానీ టెస్ట్ కెప్టెన్ గా మాత్రం కోహ్లినే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది.

SA Test Series

ఇంతవరకు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ విజయం సాధించాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనికి గాను అన్ని అంచనాలతో బరిలో నిలిచింది. దీంతో చిరకాల కోరిక ఇప్పటికైనా తీరనుందా అనే సందేహాలు ఉన్నా విజయం మనదే అనే భావన అందరిలో వస్తోంది. మరో వైపు విరాట్ కోహ్లికి కూడా ఈ సిరీస్ కీలకం కానుంది.

Also Read: రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా సమ ఉజ్జీలుగా నిలిచేందుకు ఆరాటపడుతున్నారు. విజయం తమదే అనే సందేశం ఇస్తున్నారు. దీంతో ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కు తొలి విదేశీ సిరీస్ కావడంతో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.

టీమిండియాతో పోలిస్తే దక్షిణాఫ్రికా బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ విజయం సాధించి భారత చిరకాల వాంఛ తీర్చుకోవాలని కలలు కంటోంది. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించేందుకు ఇదే మంచి తరుణంగా భావిస్తోంది.

Also Read: అల్లరి నరేష్ భార్య వృత్తిపరంగా ఏం చేస్తారో తెలుసా.. ఈమె సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Tags