Wickets fell to the ground : టి20 ఫార్మాట్ ను అత్యంత అనిచ్చితికరమైన క్రికెట్ లాగా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. క్షణం క్షణం ఉత్కంఠకు గురి చేసే మ్యాచులు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచులు జరుగుతున్నాయి కాబట్టి.. ఉత్కంఠ తారా స్థాయికి చేరుతోంది. తొలి మ్యాచ్లో పంజాబ్ పై బెంగళూరు వన్ సైడ్ విక్టరీ సాధించినప్పటికీ.. ఇక రెండో మ్యాచ్లో మాత్రం గుజరాత్, ముంబై మధ్య పోటీ హోరాహోరీగా సాగింది.
ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 229 రన్స్ టార్గెట్ విధించింది. రోహిత్ శర్మ సెంచరీ చేయలేకపోయినప్పటికీ.. 81 పరుగులతో అదరగొట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఇక అనంతరం చేజింగ్ మొదలుపెట్టిన గుజరాత్.. ప్రారంభంలోనే ఇబ్బంది పడింది. కెప్టెన్ గిల్ ఒక పరుగు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ సాయి సుదర్శన్(80) వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన కుశాల్ మెండిస్ బట్లర్ స్థానంలో వన్ డౌన్ ఆటగాడుగా వచ్చాడు. అయితే అతడు 20 పరుగులు చేసి ఉత్సాహంగా కనిపిస్తున్న సమయంలో శాంట్నర్ బౌలింగ్లో అనూహ్యంగా అవుట్ అయ్యాడు. అతడి బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి వికెట్లను తగిలాడు. దీంతో హిట్ వికెట్ గా వెనక్కి వెళ్లిపోయాడు. అతడు అవుట్ అయ్యే సమయానికి ఒక వికెట్ నష్టానికి గుజరాత్ 61 పరుగులు చేసింది. వాస్తవానికి సాయి సుదర్శన్, మెండిస్ రెండో వికెట్ కు 64 పరుగులు జోడించారు. జట్టు పట్టిష్ట స్థితిలో ఉన్నప్పుడు అతడు అవుట్ కావడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. మెండిస్ అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు.
Also Read : ఐపీఎల్ 2025 : టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే? టీంలు ఇవే
వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ మూడో వికెట్ కు ఏకంగా 80+ పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న నేపథ్యంలో.. బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేశాడు. దీంతో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. సరిగ్గా ఇతని వికెట్ పడిన తర్వాత గుజరాత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఆ తర్వాత మరసటి ఓవర్ లోనే సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి రిచర్డ్ గ్లెసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది.. సాయి సుదర్శన్ అనవసరమైన ప్రయోగానికి వెళ్లి వికెట్ కోల్పోయాడు. అప్పటిదాకా సమయోచితంగా బ్యాటింగ్ చేసిన అతడు ఒక్కసారిగా తన లయను కోల్పోవడంతో వికెట్ నష్టపోయాడు. ఇక కుషాల్ మెండిస్.. గుజరాత్ బౌలింగ్ సమయంలో కీలకమైన రెండు క్యాచులను నేలపాలు చేశాడు. ఒకవేళ అతడు గనుక ఆ క్యాచులను పట్టి ఉంటే ముంబై జట్టు ఆ స్థాయిలో స్కోర్ చేసి ఉండేది కాదు.
HITWICKET IN THE ELIMINATOR.
– Kusal Mendis just lost his wicket due to hitting the stumps. pic.twitter.com/hwfMEqRdYT
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2025