Mumbai star opener Rohit Sharma : ఐపీఎల్ చరిత్రలో ఏడువేల పరుగుల మైలురాయి సాధించిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ సీజన్లో భాగంగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్ల నిర్లక్ష్యం వల్ల రెండు జీవధానాలు రోహిత్ శర్మకు లభించాయి. దీంతో అతడు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు. తద్వారా 28 బాల్స్ లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ లో 7000 పరుగుల ఘనతను అందుకున్నాడు. మ్యాచ్ 9 ఓవర్ లో నాలుగో బంతిని సిక్సర్ గా కొట్టడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. అంతేకాదు 300 సిక్సర్ల క్లబ్లో కూడా అతడు చేరిపోయాడు.
గుజరాత్ బౌలర్ల బౌలింగ్ లో దుమ్ము రేపే విధంగా పరుగులు చేసిన రోహిత్..ముంబై జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తనకు లభించిన రెండు జీవధానాలను సద్వినియోగం చేసుకుంటూ.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వాస్తవానికి శతకం దిశగా రోహిత్ సాగినప్పటికీ.. చివరి దశలో అతడు ఔట్ కావడంతో సెంచరీకి దూరంగా నిలిచిపోయాడు.
Also Read : రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది
ఐపీఎల్ లో హైయెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా అతడు బెంగళూరులోనే కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8618 పరుగులు చేశాడు. వాస్తవానికి ఈ సీజన్లో దంచి కొడుతున్న విరాట్ కోహ్లీ ఇంతవరకు సెంచరీ చేయకపోయినప్పటికీ పరుగుల వరద మాత్రం తగ్గించడం లేదు. ఇక రోహిత్ శర్మ ఏడువేల పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో భీకరమైన ఫామ్ లో ఉన్న రోహిత్ ఇంతవరకు సెంచరీ చేయకపోయినప్పటికీ.. బీభత్సంగా పరుగులు చేస్తున్నాడు. రోహిత్ తర్వాత 6769 పరుగులతో శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. గత సీజన్లో అతడు పంజాబ్ జట్టుకు ఆడి.. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ కు దూరంగా జరిగాడు. 6,565 పరుగులతో డేవిడ్ వార్నర్, 5528 పరుగులతో సురేష్ రైనా, 5439 పరుగులతో ధోని తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన జాబితాలో గేల్ (357) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ 300* సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ 291, ధోని 264 సిక్సర్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే రోహిత్ ఇంకా ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది కాబట్టి గేల్ రికార్డులను బద్దలు కొడతాడని అతని అభిమానులు అంచనా వేస్తున్నారు. అతడు ఏమాత్రం అవకాశం లభించినా సరే వీరోచితమైన బ్యాటింగ్ తో దుమ్ము లేపుతాడని పేర్కొంటున్నారు.