MS Dhoni: క్రికెట్‌లో వికెట్ల మధ్య పరుగు ఆటగాళ్లకు ఎంతో ముఖ్యం. ఇందులో కొంతమంది స్పెషలిస్టులు, కొంతమంది బద్దకస్తులు ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్.ధోనికి ఇందులో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తుతాడనే పేరు ఉంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఐపీఎల్‌లో ధోనీ పరుగు ఆగలేదు. వికెట్ల మధ్య పరుగుల వేట కొనసాగింది. అయితే ఈ సీజన్‌లో చెన్నై చిరుత వేగం తగ్గింది. పరిగెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఔ
ఢిల్లీ క్యాపిల్స్ మ్యాచ్‌లో..
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని పరుగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు ఇది చూíసి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ధోనీ ఇలా వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడుతుంటే చాలా బాధగా ఉంది. వికెట్ల మధ్య చిరుతలాగా పరుగెత్తేవాడు‘ అని పఠాన్ ట్వీట్ చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. రెండు సిక్సర్లు కూడా బాదాడు.
పరిగెత్తించొద్దని సూచన..
అయితే తన పనే సిక్స్‌లు బాదడం అని, వికెట్ల మధ్య ఎక్కువగా పరుగెత్తకుండా చూడాలని తాను అవతలి వైపు బ్యాటర్లను కోరినట్లు మ్యాచ్ తర్వాత ధోనీ కూడా చెప్పాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. వికెట్ల మధ్య పరిగెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడు. డీసీతో మ్యాచ్ లోనూ అతని పరిస్థితి ఇలాగే ఉంది. డీసీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 126 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చాడు ధోనీ. అతన్ని చూడగానే స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా పెద్దగా అరిచారు. వాళ్లను మిస్టర్ కూల్ నిరాశపరచలేదు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టిన ధోనీ 9 బంతుల్లోనే 20 రన్స్ ్స చేశాడు. అయితే అతడు వికెట్ల మధ్య పరుగెత్తడానికి మాత్రం అంగీకరించలేదు. అంతకుముందు సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ కూడా ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు.
చివరల్లో వచ్చి.. మ్యాచ్ గెలిపించి..
ఈ సీజన్‌లో ధోనీ ఎప్పుడూ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావడానికి కూడా ప్రయత్నించలేదు. చివర్లో క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ ను గొప్పగా ముగించాలని చూశాడు. డీసీతో మ్యాచ్ లోనూ ధోనీ ఇన్నింగ్సే సీఎస్కేను గెలిపించిందని చెప్పాలి. అతడు మెరుపు వేగంతో చేసిన పరుగులే ఆ జట్టుకు మంచి స్కోరు అందించాయి. తన పని కూడా ఇలా మ్యాచ్‌లను ముగించడమే అని మ్యాచ్ తర్వాత ధోనీ స్పష్టం చేశాడు.