APL Viral Pics: టి20 టోర్నీలలో ఐపీఎల్ సృష్టించిన చరిత్ర మామూలుది కాదు. 2008లో మొదలైన ఈ టోర్నీ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ గా అవతరించింది. లక్ష కోట్ల పైకిల్కు మార్కెట్ వాల్యూను సొంతం చేసుకుంది. అన్నిటికంటే ఎక్కువగా బ్రాండ్ వేల్యూ ను దక్కించుకుంది. ఈ టోర్నీలో ఆడేందుకు ప్రపంచ దేశాల క్రికెటర్లు ఉత్సాహాన్ని చూపిస్తుంటారు.. ఐపీఎల్ లో మ్యాచ్ ల కంటే ఎక్కువగా అందమైన అమ్మాయిలను చూపించడంలో వీడియో గ్రాఫర్లు పోటీ పడుతుంటారు.
అందమైన అమ్మాయిలను చూపించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటారు ఐపిఎల్ వీడియో గ్రాఫర్లు. ఇటీవల ఐపిఎల్ జరిగినప్పుడు ధోని అవుట్ అయినప్పుడు ఓ యువతి ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించాయి. ఆ అమ్మాయి ఫోటోలు కూడా పెను ప్రకంపనలకు కారణమయ్యాయి. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా రోజులపాటు దర్శనం ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. ఇక మిగతా మ్యాచ్లో కూడా కనిపించిన అందమైన అమ్మాయిలను అత్యంత అద్భుతంగా వీడియో గ్రాఫర్లు చూపించారు. ఆ అమ్మాయిలు సెలబ్రిటీలు కూడా అయిపోయారు. ఐపీఎల్ అయిపోయింది.. ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలు ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ.. ఐపీఎల్ మాదిరిగా గ్లామర్ ఉండదు.
ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.. అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లోను ఫోటోగ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు తమ చేతికి పని చెబుతున్నారు. ఆటకు సరికొత్త గ్లామర్ తీసుకొస్తున్నారు.. వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇందులో అమ్మాయి ఫోటో ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ చూసేందుకు వచ్చినా ఓ అమ్మాయి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. వాటిని apl ఫోటోగ్రాఫర్లు అత్యంత అద్భుతంగా క్యాప్చర్ చేశారు.అవి కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో సంచలనమైంది. ఆ ఫోటోలు చూసిన వారంతా..వారెవ్వా ఏముందిరా.. హీరోయిన్ మెటీరియల్.. ఏపీఎల్ గ్లామర్ ముందు ఐపీఎల్ కూడా పనికిరాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.