Homeఎంటర్టైన్మెంట్Makeup Artist comments on Buchi Babu: తప్పు మొత్తం డైరెక్టర్ బుచ్చి బాబు దే...

Makeup Artist comments on Buchi Babu: తప్పు మొత్తం డైరెక్టర్ బుచ్చి బాబు దే అంటూ మేకప్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..

Makeup Artist comments on Buchi Babu: కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ స్పేస్ ఏ మాత్రం ఉండదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా జోడించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఏర్పడింది. వాస్తవానికి చాలా గొప్ప కాన్సెప్ట్ ని డైరెక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్నాడు. ఈ కాన్సెప్ట్ , కథ కు అసలు హీరోయిన్ అవసరం ఏ మాత్రం లేదు. కానీ […]

Makeup Artist comments on Buchi Babu: కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ స్పేస్ ఏ మాత్రం ఉండదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా జోడించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఏర్పడింది. వాస్తవానికి చాలా గొప్ప కాన్సెప్ట్ ని డైరెక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్నాడు. ఈ కాన్సెప్ట్ , కథ కు అసలు హీరోయిన్ అవసరం ఏ మాత్రం లేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే సినిమా ఎక్కదు అనే భయం తో , జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు బుచ్చి బాబు. ఈ క్యారెక్టర్ ని ఆయన జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు ఉన్నాడు , కానీ అది మిస్ ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో విపరీతమైన నెగెటివిటీ ని ఎదురుకుంటుంది.

ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు ని ఆడియన్స్ ఎలా తిడుతున్నారో , అలాంటి క్యారెక్టర్ లో నటించినందుకు హీరోయిన్ జాన్వీ కపూర్ ని కూడా అదే రేంజ్ లో తిడుతున్నారు నెటిజెన్స్. రోజురోజుకు ఈ ట్రోల్స్ ఎక్కువ అయిపోయాయి, దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్రోల్స్ పై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ చిత్రం లో నటించిన జగపతి బాబు కూడా జాన్వీ కపూర్ పై ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ రెస్పాన్స్ అయ్యాడు. అదే విధంగా యాంకర్ అనసూయ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కన్నడ టాప్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా ఈ వ్యవహారం పై స్పందిస్తూ , హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో కనిపిస్తే ఎక్కువ రీచ్ వస్తుందని , వాళ్లకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది , జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అదే, అలాంటి పాత్రలో నటించడం ఆమె తప్పు కాదు , కానీ అలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం తప్పు అంటూ చెప్పుకొచ్చింది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ అంశం పై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావలీన్ కౌర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జాన్వీ కపూర్ డైరెక్టర్ బుచ్చి బాబు కి ఒక ప్రొఫెషినల్ బౌండరీ ని గీశాడని, కానీ ఆయన జాన్వీ కపూర్ చేత ఆ గీతని దాటించేలా చేసాడని చెప్పుకొచ్చారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించాను అని డైరెక్టర్ బుచ్చి బాబు కి జాన్వీ కపూర్ ముందుగానే చెప్పారని, కానీ బుచ్చి బాబు అందుకు ఒప్పుకోలేదని , కమెర్షియాలిటీ కోసం ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తొలగించకుండా అలాగే ఉంచేశారని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల , ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper