https://oktelugu.com/

US Open : ఈసారి యూఎస్ ఓపెన్ అంచనాలకు మించి.. ఎవరు విజేతగా నిలిచినా సరికొత్త చరిత్రే

పురుషుల విభాగంలో సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ సీనర్ ఏకంగా ఫైనల్ వెళ్లిపోయాడు. మెద్వ దేవ్ పై అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే జకోవిచ్, అల్క రాస్ ను అతడు మట్టికరిపించాడు. ఈసారి ఎలాగైనా యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవాలని భావిస్తున్నాడు. అతడు సెమీ ఫైనల్ లో బ్రిటన్ దేశానికి చెందిన జాక్ డ్రేపర్ తో పోటీ పడతాడు. అయితే సెమీఫైనల్ లో సినర్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 5, 2024 / 09:00 PM IST

    US Open 2024

    Follow us on

    US Open : యూఎస్ ఓపెన్ అంచనాలకు మించి సాగుతోంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి సరికొత్త సంచలనాలను నమోదు చేస్తోంది. అటు పురుషులు, ఇటు మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగాల్లో అనితర సాధ్యమైన ఫలితాలు నమోదవుతున్నాయి. ఈసారి ఫలితాలు చూసి ప్రేక్షకులైతే షాక్ కు గురవుతున్నారు. ఇప్పటికే యూఎస్ ఓపెన్ లో జకో విచ్, అల్కా రాస్ ఇంటి బాట పట్టారు. మహిళల విభాగంలోనూ కొకో కూడా ఓటమిపాలైంది. తాజాగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వై టెక్ పరాజయం పాలైంది. ఇక పురుషుల్లోనూ మెద్వ దేవ్ పై టాప్ ర్యాంకర్ సీనర్ గెలుపును దక్కించుకున్నాడు.

    ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల విభాగంలో ట్రోఫీని ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ స్వై టెక్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమెకు క్వార్టర్స్ లో కోలుకోలేని షాక్ తగిలింది. క్వార్టర్స్ లో ఆమె ఆరవ యాంకర్ క్రీడాకారిణి జెస్సికా పెగులా(అమెరికా) చేతిలో ఓటమిపాలైంది. 2022లో యూఎస్ ఓపెన్ లో స్వై టెక్ విజేతగా ఆవిర్భవించింది. కానీ ఈసారి ఆ స్థాయిలో ఆట తీరును ప్రదర్శించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్ లో ఆమె ప్రారంభించి తడబడింది. దీంతో పెగులా పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరుస సెట్లలో విజయం సాధించి ఏకంగా సెమిస్ వెళ్ళిపోయింది.. ఫైనల్ లోకి ప్రవేశించాలంటే జెస్సికా చెక్ రిపబ్లిక్ అండ్ క్రీడాకారిణి కరోలినా తో తలపడాల్సి ఉంటుంది.. మరో సెమీఫైనల్ లో రెండవ సీడ్ క్రీడాకారిని అరియానా నవారో తో తలపడనుంది. ఒకవేళ సెమీస్ లో జెస్సికా గెలిస్తే.. యూఎస్ ఫైనల్ లో అమెరికన్ లే తలపడే అవకాశం లభిస్తుంది. కాగా, జెస్సికా కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్.

    పురుషుల విభాగంలో..

    ఇక పురుషుల విభాగంలో సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ సీనర్ ఏకంగా ఫైనల్ వెళ్లిపోయాడు. మెద్వ దేవ్ పై అద్భుతమైన విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే జకోవిచ్, అల్క రాస్ ను అతడు మట్టికరిపించాడు. ఈసారి ఎలాగైనా యుఎస్ ఓపెన్ టైటిల్ గెలవాలని భావిస్తున్నాడు. అతడు సెమీ ఫైనల్ లో బ్రిటన్ దేశానికి చెందిన జాక్ డ్రేపర్ తో పోటీ పడతాడు. అయితే సెమీఫైనల్ లో సినర్ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు.

    కొత్త విజేత ఆవిర్భవించడం ఖాయం..

    ఐతే ఈసారి జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో సరికొత్త విజేత ఆవిర్భవించడం ఖాయమని తెలుస్తోంది. మహిళల విభాగంలో అమెరికన్లే విజేతలుగా నిలుస్తారని తెలుస్తోంది. జెస్సికా ఆట తీరు అద్భుతంగా ఉన్న నేపథ్యంలో .. ఆమె ఫైనల్ వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పురుషుల విభాగంలో సినర్ ట్రోఫీని దక్కించుకోవడం ఖాయమని.. ప్రస్తుత పరిణామాలు అదేవిధంగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అతడి జోరు చూస్తుంటే సరికొత్త విజేతగా ఆవిర్భవించడం ఖాయమని అంటున్నారు.. అల్క రాస్, జకోవిచ్ ను ఓడించాడంటే.. అతడు మామూలు ఆటగాడు కాదని కొనియాడుతున్నారు.