India cricket team: నెంబర్ 4 లో ఇప్పటి వరకు ఇండియా తరుపున ఆడిన ప్లేయర్లు వీళ్లే…

India cricket team: ఇండియా టీం కి చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక బలం ఏంటంటే నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్లు…చాలా సంవత్సరాల నుంచి ఇండియా మ్యాచ్ లు గెలవడానికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఈ నెంబర్ ఫోర్ ప్లేయర్లే కారణం అనే విషయం అయితే మనకి చాలా స్పష్టం గా అర్థం అవుతుంది.నిజానికి ఇండియా టీమ్ లో ఒకప్పుడు ఓపెనర్లు కానీ, నెంబర్ త్రి, నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్లు చాలా […]

Written By: Gopi, Updated On : September 19, 2023 10:39 am
Follow us on

India cricket team: ఇండియా టీం కి చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక బలం ఏంటంటే నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్లు…చాలా సంవత్సరాల నుంచి ఇండియా మ్యాచ్ లు గెలవడానికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఈ నెంబర్ ఫోర్ ప్లేయర్లే కారణం అనే విషయం అయితే మనకి చాలా స్పష్టం గా అర్థం అవుతుంది.నిజానికి ఇండియా టీమ్ లో ఒకప్పుడు ఓపెనర్లు కానీ, నెంబర్ త్రి, నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్లు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు.

అయితే ఒకప్పుడు చాలా మంది ప్లేయర్లు నెంబర్ ఫోర్ లో ఇండియన్ టీం కి చాలా సంవత్సరాల పాటు సేవలు అందించారు…వాళ్లలో ఎవరెవరు ఇండియన్ టీం కి ఎక్కువగా సేవలు అందించారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

నెంబర్ ఫోర్ లో దిలీప్ వెంగెస్కర్ ఉన్నాడు ఈయన నెంబర్ ఫోర్ లో బ్యాటింగ్ చేస్తాడు…ఈయన మొత్తం 120 మ్యాచ్ లు ఆడితే అందులో 71 ఇన్నింగ్స్ లో మాత్రమే బ్యాటింగ్ చేసారు.అందులో ఆయన 2138 పరుగులు చేసాడు…అప్పుడు ఇండియా టీం నెంబర్ ఫోర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండేది…

ఇక ఈయన తరువాత రాహుల్ ద్రావిడ్ కూడా నెంబర్ ఫోర్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ టీం ఇండియా కి ఎన్నో విజయాలను అందించాడు. ఆయన నెంబర్ ఫోర్ లో 102 మ్యాచ్ లు ఆడితే అందులో 3301 రన్స్ చేసారు…ఇండియా టీం కి చాలా విజయాలను కూడా అందించాడు.అందుకే ఆయనని ది వాల్ అని కూడా పిలిచేవారు. ఒక్కసారి క్రీజ్ లోకి వచ్చాడు అంటే దాదాపు మ్యాచ్ విన్ అయ్యేంత వరకు ఆయన క్రీజ్ లోనే ఉండేవాడు…అంత కన్సిస్టెన్సీ గా బ్యాటింగ్ చేస్తూ ఇండియా టీం లో ఒక లెజండరీ బ్యాట్సమెన్ గా మిగిలిపోయాడు…

ఇక ఈయన తర్వాత చెప్పుకునే మరో ప్లేయర్ యువరాజ్ సింగ్…ఈయన చాలా అగ్రిసివ్ గా బ్యాటింగ్ చేయడం లో దిట్ట…ఈయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా మంచి పెర్ఫామెన్స్ ఇస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడేవాడు ఒకవైపు అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తూనే వికెట్ కూడా కాపాడుతూ టీం కష్టాల్లో ఉన్నప్పుడు మంచి పత్నర్షిప్ నెలకొల్పడం లో కీలక పాత్ర వహించేవాడు…ఇక నెంబర్ ఫోర్ లో ఆయన ఆడిన అన్ని మ్యాచ్ లకి కలిపి 3415 రన్స్ చేసాడు…

ఇక నెక్స్ట్ మనం చెప్పుకునే ఇంకో ప్లేయర్ ఎవరంటే మహమ్మద్ అజారుద్దీన్ ఈయన ఆడిన చాలా మ్యాచులకి గాను ఈయన నెంబర్ ఫోర్ లో బ్యాటింగ్ కి వచ్చి చేసిన రన్స్ 4605 … ఈయన ఇండియన్ టీం కి కెప్టెన్ గా కూడా చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించాడు…

ఇక ప్రస్తుతం నెంబర్ ఫోర్ లో కే ఎల్ రాహుల్ ఆడుతున్నాడు ఇండియా టీమ్ లో ఇప్పుడున్న ప్లేయర్ల లో నెంబర్ ఫోర్ లో సూపర్ గా ఆడే ప్లేయర్లు ఎవరు అంటే శ్రేయాస్ అయ్యర్,కే ఎల్ రాహుల్, తిలక్ వర్మ లు నెంబర్ ఫోర్ కి సరిగ్గా సరిపోయే ప్లేయర్లు…