Yuzvendra Chahal
Yuzvendra Chahal: ఉన్నంతసేపు కలిసి ఉండడం.. ఆ తర్వాత విడిపోవడం.. మరో జోడును వెతుక్కోవడం ఇటీవల కాలంలో సెలబ్రెటీల విషయంలో పెరిగిపోయింది. అంతకాలం అన్యోన్యంగా జీవించిన వారు.. చిన్న కారణాలతో విడిపోవడం.. విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. అందువల్లే సెలబ్రిటీలలో ఎవరు విడాకులు తీసుకుంటారో.. ఎవరు ఎలాంటి సంచలన విషయాలు చెప్తారో అర్థం కాని పరిస్థితి అభిమానులకు ఉంది.
Also Read: ఫైనల్లో ఇండియా విక్టరీ.. స్టేడియంలోనే దాండియా ఆడిన రోహిత్-విరాట్
టీమిండియాలో విజయవంతమైన స్పిన్ బౌలర్ గా యజువేంద్ర చాహల్(yajuvendra chahal) కు పేరుంది. వన్డేలలో, టి20 లలో టీమ్ ఇండియా సాధించిన విజయాలలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ లో అయితే హైయెస్ట్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. అయితే కరోనా సమయంలో తన సుదీర్ఘ స్నేహితురాలు ధనశ్రీ ని వివాహం చేసుకున్నాడు.. అంతకుముందే వారిద్దరు చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు పెళ్లయిన తర్వాత వారిద్దరు తరచుగా కనిపించేవారు. వివిధ షోలలో పాల్గొనేవారు. చాహల్ ఆడే మ్యాచ్ లు చూసేందుకు ధనశ్రీ వచ్చేది. తన భర్తను ఉత్సాహపరిచేది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇటీవల ముంబై లోని బాంద్రా కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. భరణం గా చాహల్ 60 కోట్ల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీనిపై అటు ధనశ్రీ, ఇటు చాహల్ నోరు విప్పలేదు.
అమ్మాయితో కలిసి..
విడాకులు తీసుకున్న తర్వాత యజువేంద్ర చాహల్ ఒక అమ్మాయి తో కలిసి దుబాయ్ వెళ్ళాడు. వారిద్దరూ నిన్న న్యూజిలాండ్ – భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. ఆ అమ్మాయి పేరు ఆర్జే మహ్వేష్ అని తెలుస్తోంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని తన కథనాలలో పేర్కొంది. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడైన టీం ఇండియా మాజీ క్రికెటర్ ధావన్ కూడా ఓ అమ్మాయితో కనిపించాడు . భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో అతడు ఆ అమ్మాయితో దర్శననిచ్చాడు. ఆయేషా అనే ఆస్ట్రేలియా మహిళను ధావన్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. తన కుమారుడిని తన వద్దకు పంపడం లేదని ఇటీవల ధావన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతనితో మాట్లాడక సంవత్సరం దాటిపోయిందని వ్యాఖ్యానించాడు. ఇంతలోనే అతడు అమ్మాయితో కనిపించడం సంచలనంగా మారింది. ఇక ఇపుడు ధనస్విత విడాకులు తీసుకున్న తర్వాత మహ్వేష్ తో కనిపించడం సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతోంది. మహ్వేష్ కొన్ని సంవత్సరాలుగా ఆర్జేగా పని చేస్తోంది. ఆమెకు మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె చాహల్ కు పరిచయమైంది. అది కాస్త ఇక్కడ దాకా దారి తీసింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Also Read: టీమ్ ఇండియా గెలిచిన వేళ.. ఆరు పదుల వయసులో స్టెప్పులు వేసిన సునీల్ గవాస్కర్..