Who is Aira Rawat: చూడ చక్కని రూపం.. అంతకుమించిన అందం.. చూపుతిప్పుకోనివ్వని శరీర ఆకృతి.. పాలమీగడలాంటి తెలుపు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గ్లామర్ వర్ణనకు అందదు. ఇంతటి అందమైన అమ్మాయి ఓవర్ నైట్ లోనే సెలబ్రెటీ అయిపోయింది. ఇంస్టాగ్రామ్ లో సంచలనం సృష్టిస్తోంది.
ఇంస్టాగ్రామ్ లో తన అందంతో సంచలనం సృష్టిస్తున్న ఆమె పేరు ఐరా రావత్.. ఇటీవల ఆమె ఒక క్రికెట్ మ్యాచ్ కు హాజరైంది. ఆ స్టేడియంలో ఆమె మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఫాలోవర్స్ చూస్తుండగానే లక్షలలో పెరిగిపోయారు.
ఐరా రావత్.. ఈ పేరు పలుకుతుంటే అమ్మాయి రూపం ధ్వనిస్తూ ఉంది కదా. వాస్తవానికి ఆమె అమ్మాయినే.. కాకపోతే నిజమైన అమ్మాయి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
బ్లూ టీ షర్ట్, తెలుపు రంగు స్కర్ట్ ధరించినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు.. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ ఏకంగా 3.60 లక్షల కు చేరుకున్నారు.
గతంలో కూడా రావత్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు చూస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ ఖాతాలో కనిపిస్తున్నాయి. అయితే ఆమె చూసేందుకు అచ్చం అమ్మాయి మాదిరిగా ఉండడంతో చాలామంది యువకులు వన్ సైడ్ లవ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆమె పూర్తిగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వ్యక్తి కావడంతో.. చాలామంది యువకులు నిరాశ చెందుతున్నారు.
రావత్ తన బయోలో ఫ్యాషన్ డ్రీమర్ అని.. డిజిటల్ క్రియేటర్ అని.. స్టైల్ ఐకాన్ అని ఉంది. సూర్య కుమార్ యాదవ్ ఆటతీరు అంటే ఇష్టమని.. యుక్త వయసు నుంచే విరాట్ కోహ్లీ అభిమానినని రావత్ తన బయోలో పేర్కొంది.