India Vs South Africa: వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇండియా ఐదు టి20 మ్యాచ్ లను ఆడింది. అందులో భాగంగానే 4-1 తేడాతో ఇండియా ఆస్ట్రేలియా టీమ్ ని చిత్తు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇప్పుడు సౌతాఫ్రికా తో జరిగే మూడు ఫార్మాట్ల సీరీస్ కోసం ఇండియన్ టీం రెడీ అయింది.
ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఫైనల్లో ఆస్ట్రేలియా మీద ఓటమిని తట్టుకోలేక రోహిత్ శర్మ , కోహ్లీ ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టి 20 సీరీస్ కి వీళ్లు దూరం అయ్యారు.అలాగే ఇప్పుడు సౌతాఫ్రికా తో ఆడే టి20, వన్డే లకు కూడా వీళ్లు దూరంగా ఉంటున్నారు. కానీ సౌతాఫ్రికా తో ఆడే రెండు టెస్టు మ్యాచ్ లకు మాత్రం వీళ్ళు అందుబాటులో ఉంటారు.
ఎందుకంటే 2025 సంవత్సరంలో జరిగే డబ్ల్యూటీసి మ్యాచ్ ల కోసం ఇప్పటినుంచే టెస్ట్ మ్యాచ్ లు గెలుస్తూ రావాలి కాబట్టి తప్పకుండా టెస్ట్ మ్యాచ్ లను గెలిచి చూపించాలి. ఇక మన టీమ్ టెస్టుల్లో గెలవాలంటే సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ కోహ్లీ ఇద్దరు అందుబాటులో ఉండాలి.అందుకోసమే కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు అందుబాటులోకి వస్తున్నారు. ఇక సౌతాఫ్రికా తో ఆడే టి20 మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించగా, వన్డే మ్యాచ్ లకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు, ఇక టెస్ట్ మ్యాచ్ ల కోసం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి 20 సీరీస్ జియో సినిమాలో ఫ్రీ గా చూశారు.కానీ ఇండియా సౌతాఫ్రికా మ్యాచ్ లకు మాత్రం స్టార్ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్ కాస్టర్ గా వ్యవహరిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వీటిని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.
ఇక ఈ మ్యాచ్ ని ఫ్రీగా చూడాలంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా మనకు నచ్చిన భాషలో చూడడానికి అందుబాటు లో ఉండే విధంగా హాట్ స్టార్ వాళ్ళు ఆరెంజ్ చేశారు…