Arjun Tendulkar: తండ్రికి మించిన ఎత్తు.. అద్భుతమైన శరీర సామర్థ్యం.. వేగంగా పరిగెత్తుకు వచ్చే నేర్పరితనం.. ఇన్ని ఉన్నప్పటికీ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) కెరియర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది.. ఎదుగు లేదు. బొదుగూ లేదు.. ఎంతోమంది ట్రైనర్లతో శిక్షణ ఇప్పించినప్పటికీ అతడు రాటుదేల లేకపోతున్నాడు. తండ్రి లాగా బ్యాటింగ్ కాకుండా.. బౌలింగ్ ను ఎంచుకున్నాడు.. అయితే అందులోనూ అతడు పూర్తిస్థాయిలో ప్రతిభను చూపించలేకపోతున్నాడు. ఐపీఎల్ (IPL)లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తరఫున ఆడుతున్నప్పటికీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలి ఐపిఎల్ మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేయడానికి ముంబై ముందుకు రాలేదు. చివరికి రిటైన్ కూడా చేసుకోలేదు. అయితే తెర వెనుక సచిన్ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ₹ 20 లక్షలకు ముంబై జట్టు కొనుగోలు చేసింది. అయితే ఈ ఐపిఎల్ లో అతడికి అవకాశం ఇస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఎంజాయ్ చేస్తున్నాడు
ఎంతోమంది క్రికెటర్లకు ట్రైనింగ్ ఇచ్చి.. వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చి.. జాతీయ జట్టు అవసరాలకు అనుగుణంగా మలిచిన ఘనత యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్ రాజ్ సింగ్( yograj Singh) కు ఉన్నది. అతడు చేతిలో పెడితే తన కుమారుడు రాటు తేలుతాడని సచిన్ భావించాడు. ఇందులో భాగంగానే అర్జున్ టెండూల్కర్ ను యోగ్ రాజ్ సింగ్ వద్దకు సచిన్ పంపించాడు.. అయితే అతడేమో యోగ్ రాజ్ సింగ్ తో కలిసి డ్యాన్సులు వేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్ షార్ట్స్ లో కనిపించింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో యోగ్ రాజ్ ట్రైనింగ్ ఇవ్వడం పక్కన పెట్టి.. అర్జున్ టెండూల్కర్ తో డ్యాన్సులు వేయిస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. అర్జున్ క్రికెట్ ను పక్కనపెట్టి బాలీవుడ్ లో హీరోగా ట్రై చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరోవైపు కొందరేమో క్రికెట్ ఆడి ఆడి అలసిపోయిన అర్జున్ కు యోగ్ రాజ్ సింగ్ ఇలా రిలీఫ్ ఇస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టు తరపున మెరుపులు మెరిపిస్తాడని.. జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకుంటాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సచిన్ పేరు నిలబెట్టేందుకు అర్జున్ టెండూల్కర్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడని.. అందువల్లే అతడు యువరాజ్ సింగ్ తండ్రి వద్ద శిక్షణ పొందుతున్నాడని సచిన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.