Also Read: మన అంబటి రాయుడు విలువ ఇప్పటికీ తెలిసొచ్చింది..
అంతకుముందు మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలోనూ చెన్నై ఓడింది. తమ ఓటములకు బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ దెబ్బతినడం కారణమని ధోనీ విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరూ సురేష్ రైనా మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. కానీ చెన్నై టీం మాత్రం.. రైనా విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు. రాయుడు కూడా లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింటోందని ధోనీ చెబుతున్నాడు. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో తాము బరిలోకి దిగాల్సి ఉందని ధోనీ చెబుతున్నాడు.
ప్రస్తుతానికి ధోనీ కూడా ఫామ్‌లో లేడు. భారం అంతా డూప్లెసిస్ మీదనే ఉంది. అంత ఒత్తిడి పెట్టుకుని డూప్లెసిస్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నారు. కనీసం డూప్లెసిస్‌కు మద్దతుగా ఉండే బ్యాట్స్‌మెన్ కూడా కరవయ్యాడు. ఒకవేళ రాయుడు గాయం నుంచి కోలుకున్నా.. అప్పటికి జట్ట ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ఓటములు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. రైనా ఎందుకు స్వదేశానికి వెళ్లాడని చెప్పాడో.. ఆ కారణం అయిపోయింది. బంధువుల్ని హత్య చేసిన వారిని పోలీసులుపట్టుకున్నారు కూడా. మరి ఇక నైనా జట్టు అవసరాల కోసం సురేష్ రైనా టీమ్‌లో చేరుతాడో లేదో..!
Also Read: ‘మహేంద్రుడి’పై విమర్శల వెల్లువ..!
రైనా రాకున్నా.. రాయుడు వచ్చినా మున్ముందు మ్యాచుల్లో చెన్నై ఏ మేరకు సత్తా చాటుతుందో తెలియకుండా ఉంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌తో బాధపడుతున్న ధోనీకి రైనా, రాయుడు లేకపోవడంతో కూడా తేరుకోకుండా తయారైంది.