India vs Australia : భారత్ vs ఆస్ట్రేలియా : వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే ఏంటి పరిస్థితి?

India vs Australia వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా సూపర్ -8 దశను మూడు పాయింట్ల తోనే ముగిస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Written By: NARESH, Updated On : June 24, 2024 11:22 am

India vs Australia

Follow us on

India vs Australia : టి20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియా – భారత జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన ఘన విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా సెమీఫైనల్ వెళ్ళిపోతుంది. మరోవైపు ఆఫ్ఘాన్ జట్టు చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియాకు.. ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరైంది.. ఒకవేళ ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ.. సెమీస్ చేరాలంటే నెట్ రన్ రేట్ ఎంతో ముఖ్యం కానుంది.

ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకమైనప్పటికీ.. వర్షం ఇబ్బంది కలిగించేలా ఉందని తెలుస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆ ప్రాంతంలో సోమవారం వర్షం కురిసేందుకు 65 శాతం అవకాశాలున్నాయట. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరుజట్లు కనీసం 5 ఓవర్లు కూడా ఆడే పరిస్థితి లేకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు. ఒకవేళ అదే జరిగితే భారత్ ఖాతాలో ఐదు పాయింట్లు ఉంటాయి. అప్పుడు గ్రూప్ -1 లో టేబుల్ టాపర్ గా భారత్ సెమీఫైనల్ వెళ్తుంది.

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా సూపర్ -8 దశను మూడు పాయింట్ల తోనే ముగిస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే నాలుగు పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే.. నెట్ రన్ రేట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సెమీస్ వెళుతుంది. ఈ సమయంలో ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు రెండు పాయింట్లకే పరిమితమవుతాయి. ఇది మార్ష్ సేనకు వరం లాగా మారుతుంది. ఒకవేళ భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

తుది జట్ల అంచనా ఇలా

రోహిత్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, రిషబ్ పంత్.

ఆస్ట్రేలియా

మార్ష్(కెప్టెన్), హెడ్, వార్నర్, మాక్స్ వెల్, స్టోయినీస్, టిమ్ డేవిడ్, వేడ్, కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్ వుడ్.