Mumbai Indians’ defeat? : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. అన్ని మ్యాచుల్లోనూ ఓటమి చెంది అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ అపజయాలే పలకరించాయి. దీంతో జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్ భయపెడుతోంది. ఆరుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టు వరుసగా ఏడు ఓటములను తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిన్న ఫార్మాట్ మ్యాచుల్లో చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయని ప్రముఖులు చెప్పడం వారికి కాస్త ఊరటనిస్తోంది. కానీ ఈ సీజన్ లోనే దారుణమైన ప్రదర్శన చేసిన జట్టుగా నిలవడం మాత్రం ప్రేక్షకులను ఆందోళన కలిగిస్తోంది.
నిజానికి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఇంతగా వెనుకబడడానికి ప్రధాన కారణం ‘ఐపీఎల్ మెగా వేలం’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మెగా వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకొని మిగతా అందరినీ వేలానికి వదిలేసింది. ట్రెంట్ బౌల్ట్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, క్వింటన్ డికాక్ లాంటి మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చే
గతంలోనే ఆరుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టు ప్రస్తుతం ఇంతటి దుర్భర స్థితి ఎదుర్కోవడానికి కారణాలేంటన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు. దీనిపై ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు.ముంబై ఇండియన్స్ త్వరలో జరిగే మ్యాచుల్లో మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 24న లక్నోతో జరిగే మ్యాచులో ముంబై ఇండియన్స్ కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని చెబుతున్నారు. దీంతో ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపే పనిలో సచిన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక స్పీడ్ స్టార్ బుమ్రా ఫాంలో లేకపోవడం ముంబై ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. గడిచిన ఐదారు మ్యాచుల్లో బుమ్రా కేవలం 4 వికెట్లు మాత్రమే తీయడం ముంబై బౌలింగ్ ఎంతలా తేలిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Chandini Chowdary: ఛాన్స్ ల కోసం అన్ని చేస్తానంటున్న తెలుగు హీరోయిన్ !
ఇక ఐపీఎల్ లోనే అత్యధికంగా 15.25 కోట్లు పెట్టిన ఇషాన్ కిషన్ పేలవ ఫామ్.. దాంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోవడం.. కీరన్ పోలర్డ్ అస్సలు ఫాంలో లేకపోవడం ముంబై పుట్టిముంచుతోంది. రోహిత్ శర్మ చేతిలో బలమైన ఆటగాళ్లు లేకపోవడం.. ఇక రోహిత్, ఇషాన్, పోలార్డ్ బ్యాటింగ్ వైఫల్యాలు.. బౌలింగ్ తేలిపోవడం లాంటివే ముంబై ఓటమికి కారణంగా కనిపిస్తున్నాయి.
పాత, కొత్త, యువ ఆటగాళ్ల భాగస్వామ్యం ఉన్నా జట్టు విజయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. దీంతో ఓటములకే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ మీద పరాభవం మాత్రం మరిచిపోలేనిది. దీంతో ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. ఇంతవరకు బోణీ కూడా కొట్టకుండా ముంబై ఇండియన్స్ పరాజయాల జట్టుగా నిలిచిపోతోంది. ఆడిన అన్నింట్లో పరాభవమే పలకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భవితవ్యంపై ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే మ్యాచుల్లోనైనా జట్టు విజయాల బాట పడుతుందో లేక అపజయాలనే మూటగట్టుకుంటుందో తెలియడం లేదు.
ఈనెల 24న సచిన్ టెండుల్కర్ జన్మదినం కావడంతో ఆ రోజు విజయం సాధించి ఆయనకు కానుకగా ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆటగాళ్లు ఏ మేరకు మేలైన ప్రదర్శన చేస్తారో? లేక విజయం ముంగిట బొక్కబోర్లా పడతారో అంతుచిక్కడం లేదు. మొత్తానికి టీం మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో ఎదురునిలిచి పోరాడకుండా వెన్నుచూపి వెనుదిరగడంతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతోంది. కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు చాంపియన్ జట్టుగా ఖ్యాతి సాధించినా ప్రస్తుతం మాత్రం విమర్శలే ప్రధానంగా ఎదుర్కొంటోంది.
Also Read: Vaishnav Tej: ప్చ్.. విలన్ వేషాలు వేస్తున్న మెగా హీరో !