Jyothi Surekha: గురువారం దేశవ్యాప్తంగా అనేకమంది క్రీడాకారులకు అవార్డుల కమిటీ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలుగు గడ్డ నుంచి క్రికెటర్ జ్యోతి సురేఖ పేరు కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అవార్డుల కమిటీ ఈసారి కూడా ఆమెను పట్టించుకోలేదు. దీంతో మరోసారి అవార్డుల కమిటీ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.
ఇటీవల జ్యోతి సురేఖ తీరును సీనియర్ క్రికెటర్, బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కొనియాడారు. ఆమె అద్భుతమైన ఆర్చర్ అని పేర్కొన్నారు. కేవలం ప్రసాద్ మాత్రమే కాదు, యావత్ విలువిద్య ప్లేయర్లు చెప్పే మాట కూడా అదే. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో అత్యధిక స్థాయిలో మెడల్స్ సాధించిన ఘనత సురేఖ సొంతం. ఆసియా క్రీడలలో హ్యాట్రిక్ సాధించింది. పంచ కప్పులో రికార్డు స్థాయిలో ప్రదర్శనలు చేసింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితే లెక్కపట్టలేని స్థాయిలో మెడల్స్ అందుకుంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఘనత అందుకున్న ఇండియన్ ఆర్చర్ గా సురేఖ రికార్డ్ సృష్టించింది.
ప్రస్తుతం సురేఖ ప్రపంచంలోనే రెండవ ర్యాంకర్ గా కొనసాగుతోంది. ఆసియాలోనే నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఒక రకంగా భారత ఆర్చరీని కొంతకాలంగా ప్రపంచ వేదికల ముందు ముఖచిత్రం లాగా నిలుపుతోంది. సురేఖ దాదాపు 17 సంవత్సరాలుగా ఆర్చరీ ప్లేయర్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77 అంతర్జాతీయ టోర్నీలలో భారతదేశం నుంచి సురేఖ ప్రాతినిధ్యం వహించింది. దాదాపు 90 మెడల్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు 2028 లాస్ ఏంజెల్స్ లో నిర్వహించే ఒలంపిక్స్ లో ఆశ్చర్యం కూడా ఒక క్రీడగా చేర్చారు. దీంతో సురేఖ భారత దేశానికి మెడల్ తీసుకు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ స్థాయిలో ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఆమెకు మాత్రం కేంద్ర క్రీడా శాఖ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదు. బుధవారం ప్రకటించిన ఖేల్ రత్న పురస్కారాలలో సురేఖ పేరును ప్రస్తావించలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023లో 148.25, 2024 లో 132.12, 2025 లో 148.37 పాయింట్లతో వరుసగా మూడుసార్లు సురేఖ ఖేల్ రత్న జాబితాలో ఉంది.
కేంద్ర నిబంధనల ప్రకారం కూడా తనే టాపర్. అయితే వరుసగా ఆమెకు నిరాశ ఎదురవుతోంది. ఈ విషయంపై ఆమె 2023, 2024లో హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఆమె పేరును పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పారిస్ ఒలంపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన మనూ భాకర్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈసారి క్రీడల శాఖ ఆమె పేరును చేర్చింది. భారత హాకీ జట్టు ఉపసారథి హార్దిక్ సింగ్, మహిళ క్రికెటర్లు స్మృతి, హర్మన్ పేర్లను పరిశీలించాలని డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే వీరికి పురస్కారాలు వస్తాయని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ సురేఖకు మాత్రం న్యాయం జరిగే దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.
Indian hearts swell in pride as Compound archers Jyothi Surekha, Parneet Kaur & Aditi Gopichand Swami stand at the pinnacle of success, winning India’s first-ever Gold at the Archery World Championships held in Berlin, and emerging as the World Champions.
My heartfelt… pic.twitter.com/uc4RvctBon— Amit Shah (@AmitShah) August 5, 2023