https://oktelugu.com/

ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై వెనుక కారణమదేనా?

ఐపీఎల్ నుంచి సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. ఢిల్లీ కేపిటల్స్ తరుఫున ఆడుతున్న అతడు.. సడెన్ గా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో మ్యాచ్ ముగిశాక తాను ఈ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఆడుతున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి విరామం తీసుకుంటున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. కుటుంబ సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్ వ్యాప్తి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2021 1:29 pm
    Follow us on

    ఐపీఎల్ నుంచి సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. ఢిల్లీ కేపిటల్స్ తరుఫున ఆడుతున్న అతడు.. సడెన్ గా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో మ్యాచ్ ముగిశాక తాను ఈ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది.

    ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఆడుతున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి విరామం తీసుకుంటున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. కుటుంబ సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రేపటి నుంచి తాను ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించాడు.

    ‘ నా ఫ్యామిలీ మెంబర్స్ లో పలువురు కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతున్నారు. వారికి ఈ కష్టకాలంలో నేను అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలుగుతున్నాను. ఒక వేళ పరిస్థితులు కుదుట పడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా.. ధన్యవాదాలు ఢిల్లీ కేపిటల్స్ కు.. ’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

    దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ కూడా స్పందించి ఈ ఆపద సమయంలో అశ్విన్ కుటుంబానికి మా సహకారం ఉంటుందని తెలిపింది.

    అయితే సన్ రైజర్స్ తో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టై అయ్యింది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ముందుగా సూపర్ ఓవర్ అశ్విన్ తోనే వేయించాలని టీం మేనేజ్ మెట్ నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో కెప్టెన్ పంత్ బంతిని అశ్విన్ ను కాదని.. అక్షర్ పటేల్ కు ఇచ్చాడు. దీంతో నొచ్చుకున్న అశ్విన్ ముభావంగా అప్పుడే పక్కకు తప్పుకున్నాడు.

    ఆ ఘటన తర్వాతనే అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగడంతో పంత్ చేసిన పని వల్లే అశ్విన్ వైదొలిగాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అసలు నిజాలు వెల్లడి కావాల్సి ఉంది.