
కరోనా పాజిటివ్ తో హొం ఐసోలేసన్ లో నే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ కు వైద్యులు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 న ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 21 న యశోద హాస్పిటల్ లో సీటి స్కాన్ తో పాటు ఇతర టెస్ట్ లను సీఎం చేయించుకున్నారు. అనంతరం హొమ్ ఐసోలేషన్ లోనే సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్నారు.