Homeక్రీడలుRishabh Pant Oxygen Therapy: రిషబ్ పంత్ ఇంట్లో ఆ యంత్రం ఏంటి.. దానితో ఏం...

Rishabh Pant Oxygen Therapy: రిషబ్ పంత్ ఇంట్లో ఆ యంత్రం ఏంటి.. దానితో ఏం పని చేస్తున్నాడు.. ఇప్పుడిదే ట్రెండింగ్!

Rishabh Pant Oxygen Therapy: రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా అతడు రూపాంతరం చెందాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు తీయడంలో అతడు నేర్పరి. అందువల్లే అతడికి విపరీతమైన అభిమానుల సపోర్టు ఉంటుంది.

రిషబ్ పంత్ సరిగా మూడు సంవత్సరాల క్రితం గాయపడ్డాడు. ఆ సమయంలో చాలా రోజులపాటు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. మైదానంలో అడుగు పెట్టాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. ఆ తర్వాత గత ఏడాది లక్నో జట్టుకు సారధిగా మారిపోయాడు. ఐపీఎల్ లో అత్యంత ధర పలికిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. రిషబ్ పంత్ వేగంగా ఆడే ఆటగాళ్లలో ఒకడు. దూకుడుగా బ్యాటింగ్ చేసే ప్లేయర్లలో ఒకడు. అందువల్లే అతడు ఆడుతుంటే అభిమానులు మాత్రమే కాదు.. తోటి ప్లేయర్లు కూడా ఎంజాయ్ చేస్తుంటారు.

రిషబ్ పంత్ గత ఏడాది ఇంగ్లాండ్ టోర్నీలో గాయపడ్డాడు. చాలా రోజులపాటు ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చాడు. తన స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. అయితే ఈసారి కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన ఇంట్లో అత్యంత ఆధునికమైన యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఆ యంత్రం అత్యంత నాణ్యమైన ఆమ్లజని (ఆక్సిజన్) తయారుచేస్తుంది. ఈ ఛాంబర్ లో కూర్చుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. శరీరంలో కణాల పెరుగుదలకు.. కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను మొత్తం తొలగించే ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛమైన గాలి లభించడం వల్ల దేహం కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏవైనా గాయాలు లేదా ఇతర రుగ్మతలు శరీరం మీద దాడి చేయకుండా తోడ్పడుతుంది. ఇటీవల కాలంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి రక్షణ పొందడానికి అతడు ఈ స్థాయిలో ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని ధర ఎంతయింది అనే విషయం మాత్రం ఇంతవరకు బయటకి తెలియ రాలేదు. టీమిండియాలో విరాట్ కోహ్లీకి కూడా ఇటువంటి ఆక్సిజన్ యంత్రం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version