Shubman Gill: శుభ్ మన్ గిల్ ధరించిన ఈ గోల్డెన్ బ్యాడ్జ్ కథేంటి? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?

రీసెంట్ గా డెంగ్యూ ఫీవర్ కారణంగా వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన బ్యాట్ తో అదరగొడుతున్నాడు.

Written By: Gopi, Updated On : October 21, 2023 1:45 pm

Shubman Gill

Follow us on

Shubman Gill: ప్రస్తుతానికి ఇండియన్ టీమ్ ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఇప్పటికే మంచి ఇన్నింగ్స్ లు ఆడుతూ మంచి దూకుడు మీద కనిపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా డెంగ్యూ ఫీవర్ కారణంగా వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్ ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన బ్యాట్ తో అదరగొడుతున్నాడు.

అయితే బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ చేసి తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.అయితే గిల్ బ్యాట్స్ మెన్ గా ఎంత పాపులర్ అయ్యాడో అంతకంటే ఎక్కువ సచిన్ టెండూల్కర్ కూతురైన సారా టెండూల్కర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తూ డేట్ చేస్తూ ఇలాంటి విషయాలతో ఆయన చాలా ఫేమస్ అయ్యాడు.ఇక ఈ విషయాలు పక్కన పెడితే బంగ్లాదేశ్ మీద మొన్న జరిగిన మ్యాచ్ లో ఆయన జెర్సీ కాలర్ దగ్గర గోల్డెన్ బ్యాడ్జ్ ధరించారు. అది చూసిన చాలా.మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలా ప్రశ్నలు వేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ మంత్ కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గోల్డెన్ బ్యాడ్జ్ ని ఇవ్వడం జరిగింది. కేవలం ఎనిమిది మ్యాచ్ ల్లోనే 480 పరుగులు చేసి అందులో రెండు సెంచరీలు, మూడు ఆఫ్ సెంచరీ లు నమోదు చేశాడు.దానికోసమే ఐసీసీ అతనికి గోల్డెన్ బ్యాడ్జ్ ను ఇవ్వడం జరిగింది…అంటే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో స్టేడియంలో సారా టెండూల్కర్ కనిపించి ప్రేక్షకులందరిని ఆకర్షించింది. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను స్టేడియం నుంచి అరుస్తూ చప్పట్లు కొడుతూ ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది.

ఇంకా అందులో బాగానే సారా స్టేడియం కి వచ్చిందనే గిల్ అద్భుతంగా ఆడాడు అని క్రికెట్ అభిమానులు అందరూ కామెంట్ చేస్తున్నారు…ఇక దానికి తోడుగా ఈ మ్యాచ్ లో గిల్ అద్బుతం గా ఆడటం కూడా వాళ్ల మధ్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది అనడానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే రేపు న్యూజిలాండ్ మీద ఆడే మ్యాచ్ లో కూడా గిల్ అద్భుతమైన పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది…