Rishabh Pant: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అద్భుతాలు సాధిస్తుందని అభిమానులు భావించారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయం సాధిస్తుందని ఆశించినా అది నెరవేరేలా కనిపించడం లేదు. దీంతో రిషబ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో విజయం సాధిస్తే భారత్ కల నెరవేరేది. కానీ పంత్ ఆటతీరుతోనే టీమిండియా ఓటమి పాలైందని అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఆస్రేలియాలో జరిగిన టెస్ట్ ల్లో పంత్ ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఏమైందో కానీ వికెట్ల వద్ద ఇట్టే దొరికిపోతున్నాడు. కొద్దిసేపు కూడా క్రీజులో నిలవడం లేదు. ఫలితంగా అప్రదిష్ట మూట గట్టుకుంటున్నాడు. పేలవ ప్రదర్శనతో సెలెక్టర్లకు తలనొప్పిలా మారుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ లలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న పంత్ కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Also Read: సౌతాఫ్రికాతో మూడో టెస్ట్.. మన రికార్డ్స్ ఏంటీ? టీమిండియాలో కీలక మార్పులు
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో పంత్ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. పేలవ షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం అభిమానుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ఫలితంగా పంత్ పై విమర్శల దాడి కొనసాగుతోంది. ఇలాగే ఆడితే భవిష్యత్ లో అతడి స్థానం కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ఆపద సమయంలో ఉన్నప్పుడు తోడుగా ఉండాల్సిన ఆటగాళ్లు చేతులెత్తేస్తే నష్టమే అని తెలుసుకుని పంత్ తన సహజ ఆటతీరుతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు.
చెత్త షాట్లకు పోయి వికెట్ పారేసుకుంటే మన ప్రతిష్టకే మచ్చ. అందుకే క్రీజులో పాతుకుపోయేందకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే తన ఆటతీరును మార్చుకోవాలని చెబుతున్నారు. ఇన్నాళ్లు అద్భుతంగానే ఆడిన పంత్ ఒక్కసారిగా వెనుకబడిపోతున్నాడు. పరుగులు చేయకుండా పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో టీమిండియా విజయాలు నమోదు చేయలేకపోతోందనే వాదనలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికైనా పంత్ తన ఆట తీరుతో అలరించాలని అభిమానుల కోరిక.
Also Read: అసలు కరోనా వచ్చిందో లేదో ఎలా గుర్తించాలంటే? జాగ్రత్తలివీ!